పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయని వైద్యులు చెబుతారు. అయితే ప్రస్తుతం పాలు తాగితే ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉందనే నెట్టింట ప్రచారం జరుగుతోంది
TV9 Telugu
ఆర్థోపెడిక్ నిపుణులు ఈ అపోహలను ఖండిస్తున్నారు. మితంగా పాలు తీసుకోవడం వల్ల ఎముకలకు ఎలాంటి హాని ఉండదని స్పష్టం చేస్తున్నారు
TV9 Telugu
అయితే ఆరోగ్యకరమైన ఎముకల కోసం పాలు మాత్రమే కాకుండా సమతుల ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకర జీవనశైలి కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు
TV9 Telugu
పాలు లేదా మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఆమ్లత్వం పెరిగి, దానిని సమతుల్యం చేయడానికి ఎముకల నుంచి కాల్షియం బయటకు వస్తుందనే అపోహ ఉంది
TV9 Telugu
సరిపడా కాల్షియంతోపాటు ప్రోటీన్ కూడా తీసుకుంటే ఎముకలు మరింత బలపడతాయని, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
ఎక్కువ పరిమాణంలో పాలు తాగడం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందనే వాదనకు ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్యులు స్పష్టం చేశారు
TV9 Telugu
ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల ఖనిజ సాంద్రత తగ్గి అవి బలహీనపడే వ్యాధి. ఇది ఒక్క ఆహారం వల్ల మాత్రమే రాదు
TV9 Telugu
వయస్సు పెరగడం, మహిళల్లో హార్మోన్ల మార్పులు, విటమిన్ డి లోపం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, అధిక మద్యపానం, పోషకాహార లోపం వల్ల మాత్రమే వస్తుంది