అరచేతిలో పట్టవు.. చాలా పెద్దగా పూసే పువ్వులు ఇవ్వేనంట!
Samatha
1 July 2026
ప్రకృతి అందం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే, అంత మంచిది. దీనిని వర్ణించడం ఎవరి తరం కాదు, అంత అందమైనది ఈ ప్రకృతి.
ప్రకృతి
ఇక ప్రకృతిలో ఎన్నో రకాల పూలు ఉన్నాయి. అందులో వ్యక్తి చేతిలో పట్టలేని పెద్ద పువ్వులు, అందమైనవి కూడా ఉన్నాయి. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
రక రకాల పూలు
డేలిలీ పువ్వులు, దాదాపు ఇవి లక్ష రకాలు అందుబాటులో ఉన్నాయంట. ఈ పువ్వులు ఒక వ్యక్తి చేతిలో పట్టవు, అంత పెద్దగా ఉంటాయి. ఇవి సరిహద్దుల్లో ఎక్కువగా పుష్పిస్తాయి.
డేలిలీ పూలు
అల్లియం పూలు, వీటిని అలంకార ఉల్లిపాయ పూలు అని కూడా అంటారు. ఇవి ఊదా రంగులో చూడటానికి చాలా అందంగా, పెద్దవిగా ఉంటాయి. అంతే కాకుండా చాలా ఎత్తులో పూస్తాయి.
అల్లియం పూలు
ఏంజెల్స్ ట్రంపెట్ మొక్క, ఇది వేలాడే పూలనిస్తుంది. చాలా పెద్దగా ఉండే ఈ పువ్వులు ఆశ్చర్యంగా కిందికి , రెండు అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. చాలా అందంగా ఉంటాయి.
ఏంజెల్స్ ట్రంపెట్
పానికల్ హైడ్రేంజియా వీటిని చిన్న గుత్తి పూలు అంటారు. ఇవి పెరిగే కొద్ది గులాబీ రంగులోకి మారుతాయి. ఇవి గుడ్రంగా గుత్తులు గుత్తులుగా పూస్తుంటాయి.
పానికల్ హైడ్రేంజియా
చాలా అందమైన, ఆశ్చర్య కరమైన పూలలో బెలూన్ పువ్వులు ఒకటి. ఇవి వికసించే ముందు మొగ్గలు బెలూన్‌లా ఉబ్బి కను విందు చేస్తాయి. ఇవి చాలా పెద్దగా ఉంటాయి.
బెలూన్ పూలు
డాలియా పూలు , అందమైన పూలలో ఇవి కూడా ఒకటి. ఇవి పది అంగుళాల వెడల్పు వరకు ఉంటాయి. చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.