AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క నూనె లేకుండా, మినపప్పు లేకుండా మెత్తటి స్పాంజీ దోసెలు.. ఒంట్లో శక్తిని పెంచే సూపర్ ఫుడ్

మినపప్పు, చుక్క నూనె లేకుండానే మెత్తగా, స్పాంజీగా ఉండే దోసెలను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం బియ్యం, మర్మరాలు ఉంటే సరిపోతుంది. వీటితో తయారయ్యే ఈ దోసె ఆరోగ్యకరమైన బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇంట్లో చిన్న పిల్లలకు, పెద్దవాళ్లకు ఇవ్వవచ్చు. వీటిని మెత్తగా రుబ్బి, పిండిని పులియబెట్టి దోసెలు వేస్తే హోటల్‌ స్టైల్‌లో మెత్తటి స్పాంజీ దోసెలు సిద్ధమవుతాయి..

Srilakshmi C
|

Updated on: Jul 01, 2026 | 7:51 PM

Share
చుక్క నూనె లేకుండా, మినపప్పు లేకుండా మెత్తటి దోసె చేసే మెత్తటి స్పాంజ్‌ దోసె చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఎలా తయారు చేయాలో, ఏమేం కావాలో ఇక్కడ తెలుసుకుందాం.. మర్మరాలు సుమారు 3 కప్పులు, బియ్యం ఒకటిన్నర కప్పు, అర టీ స్పూన్‌ మెంతులు, ఉప్పు తగినంత, నీళ్లు అవసరమైనంత తీసుకుంటే సరిపోతుంది. ఇందులో పెరుగు, వంట సోడా, ఈనో వంటివి చేర్చకుండానే మెత్తని దూదిలాంటి దోసె తయారు చేయవచ్చు.

1 / 5
బియ్యం, మెంతులను బాగా కడిగి ఒక పాత్రలో వేసుకోవాలి. ఇదులో నీళ్లు పోసి సుమారు 5 గంటలు నానబెట్టాలి. నానిన మిశ్రమాన్ని నీరు వంపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. అవసరమైనంత నీరు కలిపి దోసె పిండిలా జారుగా చేసుకోవాలి.

2 / 5
పిండిని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మర్మరాలను ఒక గిన్నెలోకి తీసుకుని, నీళ్లు పోసి బాగా కడిగి.. మిక్కీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పండిని కూడా దోసె పిండిలో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని 8 గంటలపాటు పులియబెట్టాలి. పిండిని 6–8 గంటలు లేదా రాత్రంతా మూతపెట్టి ఉంచితే ఇంకా మెత్తటి దోసెలు వస్తాయి. తర్వాత అందులో కావల్సిన మేరకు ఉప్పు వేసుకుని దోసె వేసుకోవచ్చు.

3 / 5
వేడి తవాపై ఒక గరిటె పిండి పోసి దోసెలా పరచాలి. నూనె వేయకుండా మధ్యస్థ మంటపై మూత పెట్టి కాల్చాలి. ఒక వైపు బాగా కాలిన తర్వాత తీసి వేడివేడిగా వడ్డించాలి. దీనిలోకి టమాట చట్నీ వేసుకుంటే రుచి అదిరిపోతుంది.

4 / 5
ఇందులో మర్మరాలు ఎక్కువగా ఉండటం వల్ల దోసెలు చాలా మెత్తగా వస్తాయి. పిండి బాగా పులిస్తే హోటల్‌ స్టైల్ స్పాంజీ దోసెలు వస్తాయి. నాన్‌స్టిక్ పెనం వాడితే నూనె లేకుండానే సులభంగా తీసుకోవచ్చు. పిండిలో ఒక చిటికెడు చక్కెర వేస్తే దోసెలు మరింత బంగారు రంగులోకి వస్తాయి. ఈ రెసిపీతో వచ్చే దోసెలు చాలా మెత్తగా, స్పాంజీగా ఉండి పిల్లలు, ఇంట్లో పెద్ద వాళ్లు కూడా ఇష్టంగా తింటారు.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!