Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలపై బిగ్ అప్‌డేట్.. ఆ తేదీల్లోనే అకౌంట్లోకి డబ్బులు
తల్లికి వందనం పథకంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం నిధుల విడుదలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. జులై 16, 17, 18 తేదీల్లో తల్లికి వందనం రెండో విడత నిధులు విడుదల చేయనున్నట్టు తిరుపతిలోని శ్రీకాలహస్తిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష తెలిపారు.

రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న తల్లికి వందనం పథకంపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామనే దానిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. బధవారం శ్రీకాళహాస్తిలోని టీడీపీ కార్యర్తలతో సమావేశం అయిన మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తల్లికి వందనం అమలుపై మాట్లాడారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకాన్ని జూలై 16, 17, 18 తేదీల్లో అమలు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
ఈ మూడు తేదీల్లో రాష్ట్రంలో మేగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ నిర్వహించబోతున్నామని.. ఈ సందర్భంగానే రెండో విడత తల్లికి వందనం నిధులు కూడా విడుదల చేబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై డోర్ టూ డోర్ ప్రచారాన్ని ప్రారభించబోతున్నామని.. ప్రతి పక్ష పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆయన అన్నారు.
తల్లికి వందనం..
ఏపీలో అధికారంలోకి వచ్చాక పేద విద్యార్థులకు అండగా నిల్చేందుకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చవుతున్న విద్యార్థులకు రూ.15 వేల అందిస్తోంది. ఈ నిధులను ప్రభుత్వం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే మొత్తం రూ.15 వేలలలో రూ.13 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో, రూ.2వేల విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఖాతాల్లో జమ చేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
