Vastu Tips: ఇంట్లో వెదురు మొక్కని పెంచుతున్నారా..? ఆ దిశలో పెడితే సంపదే సంపద..
డ్రాకేనా సాండెరియానా అని పిలువబడే లక్కీ వెదురు కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, ఇది అదృష్టం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యానికి చిహ్నం అంటున్నారు వాస్తు, జ్యోతిశాస్త్ర నిపుణులు. దీని నిటారుగా ఉండే కాండం, పచ్చని ఆకులు మీ ఇళ్ళు, కార్యాలయాలకు కొత్త అందాన్ని తెస్తుంది. అంతేకాదు..ఈ వెదురు మొక్క వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇంట్లో అందం, ఇంటికి పాజిటివిటీని పెంచుతుందని చెబుతున్నారు.

వాస్తు, ఫెంగ్ షుయ్ ప్రకారం, వెదురు ఆనందం, శ్రేయస్సును ఇస్తుంది. ఈ మొక్క కాలక్రమేణా ఎంతగా పెరుగుతుందో, మీరు జీవితంలో అంతగా పురోగమిస్తారని అంటున్నారు. వెదురు మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఆనందం, సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వెదురు మొక్కను నాటడం వల్ల శుభం కలుగుతుంది. అంటే, ఇది అదృష్ట మొక్క. వెదురు మొక్క ఇంట్లో మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది. ఒత్తిడి, ఆందోళన దరిచేరదు. వెదురు మొక్క ఇంట్లోని టాక్సిన్లను తొలగించి పరిసరాలను శుద్ధి చేస్తుంది.
ఇంట్లో ఎక్కడ పెడితే మంచిది..?
సాధారణంగా వెదురు మొక్కను ఇంట్లోపెంచుకునే వాళ్లు తూర్పు వైపున పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదా, ఆర్థిక సమస్యలు త్వరగా తీరాలంటే..ఈ లక్కీబాంబు ఎప్పుడూ ఆగ్నేయంలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.. ఆగ్నేయంలో వెదురు మొక్ను పెంచితే అది సంపదను ఆకర్శిస్తుందని నమ్ముతారు. డైనింగ్ టేబుల్ మధ్యలో కూడా పెట్టుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇంటిలోపల ముఖద్వారానికి దగ్గరగా అలంకరించుకుంటే జీవితంలోకి కొత్త అవకాశాలను ఆహ్వానిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వెదురును జపాన్ ప్రజలు ఆహారంలో కూడా భాగంగా తీసుకుంటారు. ఎందుకంటే, వెదురులో ఔషధ గుణాలు ఉన్నాయని వారు నమ్ముతారు. అందుకే వెదురు చెట్ల ఆకులతో టీ తయారుచేసి తాగుతారు. ఈ మొక్క ఉన్నచోట వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయని అంటారు. ఆరోగ్యంతో పాటుగా ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే, దీనిని జాగ్రత్తగా చూసుకోవడం సులభం అయినప్పటికీ , కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే.. మీ వెదురు ఎల్లప్పుడూ పచ్చగా, ఆరోగ్యంగా ఉంటుంది .
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








