AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold earrings: బంగారు చెవి పోగులను ధరిస్తే అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

మగువలకు ఆభరణాలంటే ఇష్టం. ముఖ్యంగా బంగారు ఆభరణాలకు స్త్రీలకు విడదీయరాని బంధం. అందుకనే సమయం, సందర్భంతో పని లేదు.. చేతిలో డబ్బులు ఉంటే చాలు బంగారం కొనడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ ఆభరణాలు అమ్మాయిల అందాన్ని పెంచుతాయి. అంతేకాదు ఆర్ధిక భరోసాని కూడా ఇస్తాయి. అమ్మాయిలు ఇష్టంగా ధరించే నగలలో చెవి పోగులు ఒకటి. వీటిని రకరకాల సైజ్ లో .. రకరకాలుగా ధరిస్తారు. ఈ రోజు చెవికి బంగారు పోగులు ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Gold earrings: బంగారు చెవి పోగులను ధరిస్తే అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Gold Earrings
Surya Kala
|

Updated on: Sep 08, 2025 | 4:16 PM

Share

మన హిందూ సంప్రదాయంలో అమ్మాయి పుడితే మొదట చెవికి బంగారు పోగులు కుట్టిస్తారు. అంతేకాదు ఏ చిన్న సందర్భం వచ్చినా.. ఇంట్లో అమ్మాయి ఉంది అంటూ బంగారం కొనడానికి ఆసక్తిని చూపిస్తారు. అంతగా భారతీయుల జీవితంలో బంగారంతో ముడిపడిపోయింది. నేటి యువత ఫ్యాషన్ పేరుతో రకరకాల ఆభరణాలను పెట్టుకుంటున్నారు. అయితే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వంటి సమయంలో మాత్రం బంగారు ఆభరణాలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకనే బంగారం ఖరీదైనది అయినప్పటికీ.. డిమాండ్ తగ్గలేదు. బంగారం కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపే అమ్మాయిలు వివిధ డిజైన్ల ఆభరణాలను సేకరిస్తారు. బంగారం ప్రతిష్టకు చిహ్నం. అయితే బంగారం నగలలో చెవి పోగులకు ప్రత్యేక స్థానం ఉంది. బంగారు చెవిపోగులు ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి . అవును బంగారు చెవిపోగులు ఇష్టపడని వారు దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే చెవిపోగులు ధరించకుండా ఉండలేరు.

బంగారు చెవిపోగుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  1. బంగారు చెవి పోగులు ధరించడం వలన అందాన్ని పెంచడమే కాదు శారీరక , మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
  2. బంగారు చెవిపోగులు ధరించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది.
  3. బంగారు చెవిపోగులు ధరించిన వారి మనస్సు నుంచి ప్రతికూల ఆలోచనలను తీసివేసి.. తద్వారా సానుకూలంగా ఉండటానికి సహాయపడతాయి.
  4. బంగారు చెవిపోగులు సానుకూల శక్తిని ఆకర్షించడంలో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
  5. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును ప్రేరేపిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  6. బంగారు చెవిపోగులు ధరిస్తే కంటి చూపు మెరుగుపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)