ఇనుము, ఇత్తడి లేదా స్టీల్.. వంట చేయడానికి ఏ పాత్రలు ఎక్కువ ప్రయోజనకరం.. నిపుణులు ఏం చెప్పారంటే
ప్రస్తుతం ప్రజలు వంటగదికి ఫ్యాన్సీ లుక్ ఇవ్వడానికి ప్లాస్టిక్ వస్తువులతో పాటు నాన్ స్టిక్ పాత్రలు, వివిధ లోహాలతో చేసిన పాత్రలను ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా ఆహారంలోని పోషక విలువలు తగ్గడమే కాకుండా ఆ ఆహారం తిన్నవారికి విషంతో సమానం అవుతుంది. మార్కెట్‌లో ఇనుము, స్టీల్, ఇత్తడి వంటి అనేక లోహాలతో చేసిన పాత్రలు లభిస్తున్నాయి. అయితే ఈ పాత్రలలో ఏది వంటకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం..
ఆహారంలో ఉండే పోషక విలువల గురించి మాట్లాడినప్పుడల్లా కూరగాయలు, వాటిలో ఉపయోగించే మసాలాల గురించి మాట్లాడుతాము. అయితే ఏ ఆహారాన్ని ఏ పాత్రలో వండుతున్నామో గుర్తుపెట్టుకోవాలి. కూరగాయలను సరిగ్గా కడగడం ఎంత ముఖ్యమో, వంట చేయడానికి సరైన పాత్రను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలాసార్లు తెలిసో తెలియకో లేదా తొందరపడి ఇవేమీ పట్టించుకోకుండా ఎదురుగా ఏ పాత్ర కనిపిస్తే ఆ పాత్రలో ఆహారాన్ని వండుతారు. అయితే ఒక్కోసారి మన ఈ అలవాటు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
మనం ఏం తింటున్నామో ఏ పాత్రలో వండుతున్నామో ప్రత్యేకంగా చూసుకోవాలి. మనం ఆహారాన్ని తప్పుడు పాత్రలలో వండినట్లయితే.. అది నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ప్రజలు వంటగదికి ఫ్యాన్సీ లుక్ ఇవ్వడానికి ప్లాస్టిక్ వస్తువులతో పాటు నాన్ స్టిక్ పాత్రలు, వివిధ లోహాలతో చేసిన పాత్రలను ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా ఆహారంలోని పోషక విలువలు తగ్గడమే కాకుండా ఆ ఆహారం తిన్నవారికి విషంతో సమానం అవుతుంది. మార్కెట్‌లో ఇనుము, స్టీల్, ఇత్తడి వంటి అనేక లోహాలతో చేసిన పాత్రలు లభిస్తున్నాయి. అయితే ఈ పాత్రలలో ఏది వంటకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం..
ఇత్తడి పాత్రలు ఇత్తడి పాత్రలు చాలా బరువుగా ఉంటాయి. సాధారణంగా ఈ పాత్రలలో సాంప్రదాయ వంటకాలు మాత్రమే వండుతారు. చాలా మంది ఇత్తడి పాత్రల్లో నాన్ వెజ్ వండడానికి ఇష్టపడతారు. అయితే ఇత్తడి పాత్రలు అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉప్పు, ఆమ్ల పదార్థాలతో ప్రతిస్పందిస్తాయి. కనుక ఇత్తడి పాత్రల్లో ఇలాంటి ఆహారాన్ని తయారు చేయడం మానుకోవాలి. అయితే బియ్యం వేయించడానికి లేదా వండడానికి ఇత్తడి పాత్రలను ఉపయోగించవచ్చు.
ఇనుప పాత్రలలో వంట చేయడం వల్ల కలిగే నష్టాలు ఇప్పటికే ఐరన్ పుష్కలంగా ఉన్న కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇనుప పాత్రలలో వంట చేసినట్లు అయితే అది ఆహారం రుచి, రంగును పాడుచేయడమే కాదు శరీరంలో అదనపు ఐరన్‌కు చేరుకునేలా చేస్తుంది. దీని కారణంగా అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు. అందువల్ల ఎంపిక చేసుకున్న కొన్ని వస్తువులను ఇనుప పాత్రల్లో వంట చేయవద్దు.
స్టీల్ పాత్రలు చాలా మంది ప్రజల ఇళ్లలో వంటకు స్టీలు పాత్రలే వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో కూడా ఎక్కువగా స్టీల్ పాత్రలే కనిపిస్తాయి. ఎందుకంటే స్టీలు పాత్రల్లో ఆహారాన్ని వండటం హానికరం కాదు. మీరు దానిలో ఆహారాన్ని వండుకోవచ్చు అలాగే నిల్వ చేయవచ్చు. ఈ పాత్రలు ఏ విధంగానూ హాని చేయవు. అందుకని మనం వంట చేయడానికి వీలైనంత ఎక్కువగా స్టీలు పాత్రలనే ఉపయోగించండి.
వంట చేయడానికి ఏ మెటల్ పాత్రలు ఉపయోగించాలో సరైన సమాచారం డాక్టర్ కిరణ్ గుప్తా చెప్పారు. డాక్టర్ కిరణ్ గత 12 సంవత్సరాలుగా యోగా, నేచురోపతిలో సేవలందిస్తున్నారు. లోహ పాత్రల గురించి డాక్టర్ కిరణ్ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం.
నిపుణులు ఏమంటారు?
ఎవరికైనా ఇప్పటికే కాలేయ సంబంధిత సమస్య ఏదైనా ఉంటే పొరపాటున కూడా ఐరన్ పాత్రల్లో ఆహారాన్ని వండకండి అంటున్నారు డాక్టర్ కిరణ్. ఇది సమస్యను మరింత పెంచవచ్చు. ఇనుప పాత్రలలో ఆహారాన్ని వండటం వలన ఆహారంలో ఐరన్, మెగ్నీషియం అధికంగా చేరుతాయి. దీని కారణంగా అనేక ఇతర వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతే కాకుండా ఇనుప పాత్రలో పులుపు వండుకుంటే కూరలు పాడవుతాయి.
స్టీలు పాత్రలలో వండటం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు. అయితే ఈ పాత్రల్లో వంట చేయడంలో ఒక్కటే లోపము ఏమిటంటే మీ పాత్రలు పల్చగా ఉంటే ఆహారం త్వరగా అడుగంటుంది.
పెరుగు వంటి గ్రేవీ లేదా పుల్లని కూరగాయలు లేదా టమోటాలు ఉన్న ఆహారాలను ఇత్తడి పాత్రలలో వంట చేయవద్దు. ఇత్తడి పాత్రలను కొనుగోలు చేసేటప్పుడు.. వాటిపై కోటింది వంటి తేలికపాటి పొర ఉండాలని గుర్తుంచుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..