AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: మీరు వాడే తలదిండు, మీ వెన్నముకపై ప్రభావం చూపుతందని తెలుసా..?

నిద్యకు ఉపయోగపడే దలదిండుతో వెన్నముకపై ప్రతికూల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వెన్నుముక నిటారుగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. కానీ సరైన తలదిండును ఉపయోగించకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక కొందరు నిద్రించే సమయంలో రెండు తలదిండ్లను ఉపయోగిస్తారు. దీనివల్ల కూడా వెన్నుముకపై ప్రభావం చూపుతుంది...

Lifestyle: మీరు వాడే తలదిండు, మీ వెన్నముకపై ప్రభావం చూపుతందని తెలుసా..?
Health
Narender Vaitla
|

Updated on: Mar 26, 2024 | 2:57 PM

Share

నిద్రలేమీ.. ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రాధానమైంది. మారుతోన్న జీవన విధానం కారణంగా ఈ సమస్య బారినపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక మనలో చాలా మందికి దల దిండు ప్రధాన సమస్య. ఇది లేనిదే నిద్ర పట్టని వారు చాలా మంది ఉంటారు. అయితే నిద్రకు ఉపక్రమించేందుకు ఉపయోగపడే తల దిండుతో ఆరోగ్య సమస్యలు కూడా తప్పవని మీకు తెలుసా.? తల దిండు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్యకు ఉపయోగపడే దలదిండుతో వెన్నముకపై ప్రతికూల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వెన్నుముక నిటారుగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. కానీ సరైన తలదిండును ఉపయోగించకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక కొందరు నిద్రించే సమయంలో రెండు తలదిండ్లను ఉపయోగిస్తారు. దీనివల్ల కూడా వెన్నుముకపై ప్రభావం చూపుతుంది. దీంతో తల ఎత్తు పెరిగి వెన్నుపూసపై ఒత్తిడి పెరుగుతంది. ఇది నడుము నొప్పికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరికొన్ని సందర్భాల్లో వెన్నుపూసపై పడే ఒత్తిడి ప్రభావం తలనొప్పి, మెడ, వెన్ను సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. తల దిండు సరిగ్గా లేకపోతే.. భుజాలు, చేతి నరాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది ఒళ్లు నొప్పులకు కూడా కారణమవుతుంది. అలాగే దిండు సరిగ్గా లేకపోతే వెనుక కండరాలు వంకరలుగా మారుతాయి. ఇది నొప్పికి దారి తీస్తుంది. కొందరిలో ఎక్కువసేపు నిద్రిస్తే ఒళ్లు నొప్పులు రావడానికి ఇదే ప్రధాన కారణం.

ఈ సమస్యల నుంచి బయటపడాలంటే సన్నని దిండును ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. అది కూడా చాలా మృదువుగా ఉండాలి. దిండు దృఢంగా ఉంటే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ప్రతీ రెండేళ్లకు ఒకసారైనా మీ తల దిండును మారుస్తూ ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..