Kids: మీ పిల్లలు కోపంతో ఊగిపోవడానికి కారణం మీరే, ఎందుకో తెలుసా..
పిల్లల్లో కోపానికి ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్స్ వినియోగమేనని నిపుణులు చెబుతున్నారు. జామా పీడియాట్రిక్స్‌లో ప్రచురించిన నివేదక ఈ విషయాలను చెబుతోంది. ముఖ్యంగా 5 ఏళ్లలోపు ఉన్న చిన్నారుల్లో ఈ లక్షణం కనిపించడానికి ప్రధాన కారణం...
కోపం అనేది సర్వసాధారణమైన ఎమోషన్. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కోపం వస్తూనే ఉంటుంది. అయితే పెద్దలకు కోపం వస్తే ఓ అర్థం ఉంటుంది. మరీ చిన్న పిల్లలు కోపంతో ఊగిపోతుంటే, అడిగింది ఇవ్వకపోతే కేకలు పెడుతూ అరుస్తుంటే.. అది కచ్చితంగా నార్మల్ కాదు. చిన్నారులు ఇలా కోపంతో ఊగిపోవడానికి పేరెంట్సే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పిల్లల్లో కనిపించే ఈ అబ్ నార్మల్ బిహేవియర్‌కి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లల్లో కోపానికి ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్స్ వినియోగమేనని నిపుణులు చెబుతున్నారు. జామా పీడియాట్రిక్స్‌లో ప్రచురించిన నివేదక ఈ విషయాలను చెబుతోంది. ముఖ్యంగా 5 ఏళ్లలోపు ఉన్న చిన్నారుల్లో ఈ లక్షణం కనిపించడానికి ప్రధాన కారణం విపరీతమైన స్మార్ట్ ఫోన్ వినియోగమేనని నిపుణులు అంటున్నారు. గంటల తరబడి గ్యాడ్జెట్స్‌తో గడిపే వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నట్లు తేలింది.
కెనడియన్ అధ్యయనం ప్రకారం.. ఐదేళ్లలోపు చిన్నారుల్లో స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ ఉపయోగించే వారిలో కోపం ఎక్కువగా కనిపించినట్లు తేలింది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన రోజుల్లో ఆ పరిశోధన నిర్వహించారు. ఫోన్‌లో ఎక్కువ సమయం గడిపే పిల్లలు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారని తేలింది. అయితే గ్యాడ్జెట్స్‌ను తక్కువగా ఉపయోగించే వారిలో కోపం తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.
గంటల గరబడి ఫోన్‌లతో ఉండే చిన్నారుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే చిన్నారులకు ఫోన్‌లను దూరంగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. వారి దృష్టిని మళ్లించడానికి ఆటలు నేర్పించడం, పజిల్ గేమ్స్ లాంటివి అలవాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇక చిన్నారుల భావోద్వేగాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..