AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black grapes: నల్ల ద్రాక్ష ఆరోగ్య రక్ష..! రెగ్యూలర్‌గా తింటే ఈ సమస్యలన్నీ దూరం..

నల్ల ద్రాక్షలో సహజ చక్కెరలు ఉండటం వల్ల మధుమేహం బాధితులకు మంచి పండుగా నిపుణులు చెబుతున్నారు. ఎండిన నల్ల ద్రాక్షలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడంతో సహాయపడుతుంది. వీటిని తింటే రక్తనాళాలు రిలాక్స్‌ అవుతాయి. ఎండిన నల్ల ద్రాక్షలో ఐరన్‌ సైతం లభిస్తుంది. ఇది రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఎండిన నల్ల ద్రాక్ష తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Black grapes: నల్ల ద్రాక్ష ఆరోగ్య రక్ష..! రెగ్యూలర్‌గా తింటే ఈ సమస్యలన్నీ దూరం..
Black grapes
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2025 | 2:11 PM

Share

నల్ల ద్రాక్ష, బ్లాక్‌ గ్రేప్స్‌.. చాలా మందికి ఇష్టమైన ఫ్రూట్స్‌.. అంతేకాదు.. ఇవి పుష్కలమైన పోషకాలతో ఉంటాయి. నల్ల ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ బితో పాటు ఫైబర్‌, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాలు నల్లద్రాక్షలో సమృద్ధిగా లభిస్తాయి..నల్లద్రాక్షలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మనలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎముకలకు మంచిది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి, బోలు ఎముకల సమస్య రాకుండా చేస్తుంది. అంతేకాదు..ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో కొంతవరకూ క్యాన్సర్ తగ్గుతుంది.

నల్లద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్లం వంటి ప్రమాదాలు దూరమవుతాయి. నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్ష్, ఆంథోసైనిన్స్ వంటి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరాన్ని కాపాడుతుంది. నల్లద్రాక్షలో పొటాషియం రక్తపోటుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తపోటుని తగ్గించడం వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది.

అంతేకాదు.. నల్లద్రాక్షలో డైటరీ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను ఆరోగ్యంగా మార్చుతుంది. ఎండిన నల్ల ద్రాక్ష తింటే మలబద్దకం దూరం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు నల్ల ద్రాక్ష తినటం మంచిది. ఇందులో అతితక్కువ క్యాలరీలు ,ఫైబర్‌  అధిక మొత్తంలో నీరు ఉంటుంది. నల్ల ద్రాక్షలో సహజ చక్కెరలు ఉండటం వల్ల మధుమేహం బాధితులకు మంచి పండుగా నిపుణులు చెబుతున్నారు. ఎండిన నల్ల ద్రాక్షలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడంతో సహాయపడుతుంది. వీటిని తింటే రక్తనాళాలు రిలాక్స్‌ అవుతాయి. ఎండిన నల్ల ద్రాక్షలో ఐరన్‌ సైతం లభిస్తుంది. ఇది రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఎండిన నల్ల ద్రాక్ష తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గ్యాస్ త్వరగా అయిపోతుందా? ఇవి మార్చుకోండి!
గ్యాస్ త్వరగా అయిపోతుందా? ఇవి మార్చుకోండి!
బాహుబలి 2లో నేను లేకపోయినా ఫేమస్ అయ్యా..
బాహుబలి 2లో నేను లేకపోయినా ఫేమస్ అయ్యా..
అచ్చం లెగ్ పీస్ లాంటి రుచి! సోయా చాప్ చేసి పెడితే పిల్లలకు పండగే
అచ్చం లెగ్ పీస్ లాంటి రుచి! సోయా చాప్ చేసి పెడితే పిల్లలకు పండగే
నాగేశ్వరరావు ఆఖరి కోరిక తీర్చలేకపోయిన చిరంజీవి..ఇప్పుడైనా నాగ్‌తో
నాగేశ్వరరావు ఆఖరి కోరిక తీర్చలేకపోయిన చిరంజీవి..ఇప్పుడైనా నాగ్‌తో
సంపద బాగా పెరగాలంటే.. ఆదివారం మిరియాలతో ఈ ఒక్క పని చేయండి!
సంపద బాగా పెరగాలంటే.. ఆదివారం మిరియాలతో ఈ ఒక్క పని చేయండి!
పెట్రోల్ బంక్ కింద ఎంత పెట్రోల్ ఉంటుంది..? భూగర్భ ట్యాంకుల రహస్యం
పెట్రోల్ బంక్ కింద ఎంత పెట్రోల్ ఉంటుంది..? భూగర్భ ట్యాంకుల రహస్యం
ఆహా అద్భుతం.. రాగి పండితో ఇలా కరకరలాడే వడలు చేసుకుంటే
ఆహా అద్భుతం.. రాగి పండితో ఇలా కరకరలాడే వడలు చేసుకుంటే
సశస్త్ర సీమా బల్‌లో 827 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సశస్త్ర సీమా బల్‌లో 827 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
IPL 2026: బీసీసీఐ షాక్‌తో దారికొచ్చిన బంగ్లాదేశ్..
IPL 2026: బీసీసీఐ షాక్‌తో దారికొచ్చిన బంగ్లాదేశ్..
టిక్కెట్ ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో! రైల్వే స్టేషన్‌లో వివాదం
టిక్కెట్ ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో! రైల్వే స్టేషన్‌లో వివాదం