Tulsi For Hair Health: మృదువైన జుట్టు కోసం తులసి ఉపయోగాలు.. ఇలా వాడితే అద్భుతం చూస్తారు..!
తరచుగా తల దురదతో బాధపడేవారు కూడా తులసిని ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. కేశాలకు నిగారింపునిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీని కోసం మీరు తులసిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. దాంతో మీరు తులసి గరిష్ట ప్రయోజనాలను పొందుతారు.
జుట్టు ఆరోగ్యానికి తులసి: చర్మ వ్యాధులో చికిత్సలో భాగంగా తులసిని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ఈ తులసి జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తులసిని సక్రమంగా ఉపయోగించడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తులసి ఆకులు జుట్టును మెరిసేలా చేస్తాయి. తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అందరికీ తెలిసిందే. ఇలా చేయడం వల్ల చుండ్రు సులభంగా తొలగిపోతుంది. తరచుగా తల దురదతో బాధపడేవారు కూడా తులసిని ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి, కేశాల ప్రకాశాన్ని నిర్ధిష్టంగా ఉంచుతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దీని కోసం మీరు తులసిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి.. దాంతో మీరు మరింత ప్రయోజనాన్ని పొందగలుగుతారు.
తులసి, ఉల్లిపాయ రసం..
ముందుగా, తులసి ఆకులను నీడలో ఎండబెట్టాలి. దాని పొడిని సిద్ధం చేసుకోవాలి. దానికి ఒక చెంచా ఉల్లిపాయ రసం కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపాలి. వాటన్నింటిని సరిగ్గా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేయండి.ఈ పేస్ట్ ను రూట్ నుండి జుట్టు చివర వరకు అప్లై చేయాలి. అరగంట పాటు ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో, తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రంగా కడగాలి.
తులసి, గుడ్లు..
తులసి, ఉల్లిపాయ పేస్ట్ మాదిరిగానే తులసి మరియు గుడ్డు పేస్ట్ కూడా జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందు కోసం మీరు గుడ్డులోని పచ్చసొన భాగాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అందులో టీ ట్రీ ఆయిల్ కలపాలి. ఈ పేస్ట్‌ను బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. పేస్ట్ ఆరిన తర్వాత ఒక టవల్ ను వేడి నీటిలో ముంచి మీ తలపై ఉంచి ఆవిరి పట్టండి. దీని తర్వాత మీ తలను తేలికపాటి షాంపూతో కడగాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..