AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traveling Tips: ప్రయాణాల్లో మీరూ అనారోగ్యానికి గురవుతున్నారా? ఈ చిట్కాలు మీ జర్నీని ఆనందమయం చేస్తాయ్‌..

ప్రయాణాలంటే చాలా మందికి ఇష్టం ఉన్నా కొందరు మాత్రం అనారోగ్యానికి గురవుతుంటారు. దీంతో నచ్చిన ప్రాంతానికి వెళ్లలేక ఇంటికే పరిమితం అవుతుంటారు. అయితే ఇలాంటి వారికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. వీటిని అనుసరిస్తే ఎంత దూరమైనా.. ఎన్ని రోజులైనా.. హాయిగా జర్నీ చేయచ్చట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Traveling Tips: ప్రయాణాల్లో మీరూ అనారోగ్యానికి గురవుతున్నారా? ఈ చిట్కాలు మీ జర్నీని ఆనందమయం చేస్తాయ్‌..
Travelling Tips
Srilakshmi C
|

Updated on: Jan 12, 2025 | 2:54 PM

Share

కొంతమంది ఎక్కువసేపు ప్రయాణం చేస్తే వెంటనే అనారోగ్యానికి గురవుతుంటారు. రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వీరిలో అధిక మందికి జీర్ణ సంబంధ సమస్యలు వస్తుంటాయి. ప్రయాణంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల కడుపుపై ​​ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి. ప్రయాణం చేయడమంటే మనకు ఇష్టమే అయినా, వచ్చే అనారోగ్య సమస్యల వల్ల ప్రయాణాన్ని మానుకోవడం వంటివి చేస్తుంటాం. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా నివారించవచ్చు. జర్నీ కూడా ఎంజాయ్‌ చేయవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తేలికపాటి భోజనం మాత్రమే తీసుకోవాలి

ప్రయాణాల్లో తినే, తాగే అలవాట్లు సరిగా లేకుంటే పేగు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి సందర్భాలలో మీరు కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ప్రయాణంలో స్పైసీ ఫుడ్ లేదా ఇతర వేయించిన ఆహారాన్ని తినడం చాలా మందికి అలవాటు. ఇది పొట్టను బరువుగా చేస్తుంది. అంతే కాకుండా ప్రయాణ పరిస్థితుల్లో నిరంతరం కూర్చోవడం వల్ల ఆహారం జీర్ణం కాదు. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ప్రయాణం తర్వాత కూడా తేలికపాటి భోజనం తీసుకోవాలి. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పుష్కలంగా నీరు తాగాలి

మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వీలైనంత ఎక్కువ నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. సాధారణంగా ప్రయాణ సమయంలో అధిక మంది తక్కువ నీరు తాగుతుంటారు. ఇది అపానవాయువు, ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. కాబట్టి నీటితోపాటు ద్రవాహారం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

నడక అవసరం

జర్నీ తర్వాత మీ దినచర్యలో వ్యాయామం లేదా నడకను చేర్చుకోవడం చాలా అవసరం. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి తిన్న తర్వాత కొంచెం నడవడం అలవాటు చేసుకోవాలి. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది. రోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల శరీరానికి మంచిదని నిపుణులు సైతం చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.