Goa Trip: గోవా టూర్‌కు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే వీటిని తీసుకెళ్లడం అసలు మర్చిపోవద్దు
Travelling Tips: పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తుంటారు. అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెకేషన్‌కు వెళుతుంటారు.

Travelling Tips: పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తుంటారు. అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెకేషన్‌కు వెళుతుంటారు. కాగా మన దేశంలో టూరిస్టులు అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశం గోవా. ఇక్కడి అందమైన బీచ్‌లతో పాటు చర్చిలు, క్యాసినోలు, రిసార్ట్ టూరిజం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ప్రేమికులు, హనీమూన్ జంటలకు గోవా బాగా నచ్చుతుంది. ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు మన దేశం నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఇక మనలో చాలామంది కూడా వెకేషన్‌కు వెళ్లాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే ప్లేస్ గోవా. మరి మీరు కూడా గోవాకు ట్రిప్ ప్లాన్ చేసి, మొదటి సారి వెళ్తున్నట్లయితే కొన్ని ముఖ్యమైన వస్తువులను తప్పకుండా తీసుకెళ్లాలి. తద్వారా టూర్‌ను మరింత ఆస్వాదించవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
టోపీలు గోవా బీచ్‌లలో సూర్యుని హానికరమైన కిరణాలుచాలా హాని కలిగిస్తాయి. అందువల్ల, సూర్యరశ్మి నుంచి జుట్టు, ముఖాన్ని రక్షించడంలో టోపీలు బాగా ఉపయోగపడతాయి.
స్విమ్మింగ్ దుస్తులు గోవా అంటే నే బీచ్‌లకు నెలవు. కాబట్టి గోవాలో స్విమ్మింగ్‌ని ఆస్వాదించాలనుకుంటే, ఖచ్చితంగా ఈత దుస్తులకు మీ బ్యాగ్‌లో స్థానం కల్పించాల్సిందే. ఒకవేళ వీటిని తీసుకెళ్లకపోతే అక్కడ ఎక్కువ డబ్బులు చెల్లించి కొనాల్సి ఉంటుంది.




సన్ గ్లాసెస్ గోవా వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ వెంట తీసుకెళ్లడం కూడా మంచిది. ఎందుకంటే అక్కడి సూర్య కిరణాల బారి నుంచి మన కళ్లను కాపాడుకోవాలంటే ఇవి ఎంతో ముఖ్యం. అలాగే టూర్‌లో కూల్ లుక్ అనుభూతిని కూడా పొందుతారు.
సన్‌స్క్రీన్ గోవా వెళ్లిన టూరిస్టుల్లో చాలామందికి సన్‌బర్న్ లేదా చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. వీటిని అధిగమించడం కోసం ముందు జాగ్రత్తగ సన్‌స్క్రీన్ ధరించడం మర్చిపోవద్దు. ప్రజలు తరచుగా గోవా బీచ్‌లలో విశ్రాంతి తీసుకుంటారు. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ రాసుకుని వెళ్లడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..