జైలు నుంచే ఆ హీరోయిన్ కుప్రేమలేఖ రాసిన ఖైదీ!వీడియో
వాలంటైన్స్ డే సందర్భంగా బాలీవుడ్ నటికి.. ఓ ఆర్థిక నేరగాడు జైల్లో నుంచి ప్రేమలేఖ రాశాడు. ఆ నేరగాడు కోట్ల రూపాయలు విలువ చేసే కానుకలు ఆమెకు ఇచ్చినట్లు నిరూపితం కావడంతో ఇప్పుడా నటి భవిష్యత్ చిక్కుల్లో పడింది. మరో జన్ముంటే ఆమె హృదయంగా పుట్టాలనుందని లేఖలో రాసాడు. ఆమెకు తాజాగా ఓ ప్రైవేట్ జెట్‌ను కానుకగా ఇస్తున్నట్లు తెలిపాడు.జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ప్రేమలేఖ రాశాడు. బేబీ.. హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ లెటర్ మొదలుపెట్టాడు. ఈ ప్రపంచంలోనే అద్భుతమైన ప్రియురాలివి. వృత్తిలో భాగంగా వివిధ దేశాలకు వెళ్లే నటికి ఒక ప్రైవేట్ జెట్‌ను కానుకగా ఇస్తున్నాననీ తెలిపాడు. ఆమె పేరులోని తొలి అక్షరాలు ఆ జెట్‌పై రాసి ఉంటాయనీ అదే విధంగా ఆమె పుట్టిన రోజు తేదీతో రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్నాననీ తెలిపాడు.
సుఖేశ్ 2020 జూన్ నుంచి మే 2021 వరకు మొబైల్ ఫోన్లు, వాయిస్ మాడ్యూలర్లు ఉపయోగిస్తూ ర్యాన్‌బ్యాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అదితి సింగ్‌కు ఫోన్లు చేశాడు. లా సెక్రటరీ అనూప్‌కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడు. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలోనే అతడు జాక్వెలిన్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఆమె తన ప్రియురాలని చెప్పాడు. ఇదిలా ఉంటే సుఖేశ్ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వాపోయింది. అతడు తన జీవితంతో ఆడుకుని కెరీర్‌ను నాశనం చేశాడని.. కోర్టు ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఇంత జరిగినా సుఖేశ్ మాత్రం జాక్వెలిన్‌కు జైలులో నుంచే ప్రేమ లేఖలు రాస్తున్నాడు. ప్రతీ పండుగకు లేఖ పంపిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా పారిస్‌లో ఒక వైన్ యార్డ్‌నే కానుకగా ఇస్తున్నట్లు తెలిపాడు.

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే
