సాధారణంగా దొండ కాయలను చేస్తే చాలా మంది మూతి తిప్పేసుకుంటారు. ఈ కూరగాయ తింటే తెలివితేటలు తగ్గిపోతాయనే భావన చాలా మందిలో ఉంటుంది
TV9 Telugu
అందుకే తల్లిదండ్రులు సైతం ఈ కూరగాయను పిల్లలకు ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే ఇలాంటి అపోహలను నమ్మవద్దని పోషకాహార నిపుణులు అంటున్నారు
TV9 Telugu
ఆయుర్వేదంలో కూడా దొండకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ఫైబర్, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
ఆయుర్వేదంలో దొండ మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ-అడిపోజెనిక్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి
TV9 Telugu
కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వారానికి ఒకసారి దొండ తినడం లేదా దాని ఆకుల రసం తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో థయామిన్ కూడా ఉంటుంది
TV9 Telugu
దొండ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా కూడా మారుస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఇది అల్సర్, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది
TV9 Telugu
దొండ తింటే మగత, మెంటల్ రిటార్డేషన్ సమస్యలు వస్తాయని అంటుంటారు. నిజానికి, దొండ ఆహారంలో తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థను బలపరుస్తుందని, అల్జీమర్స్ వంటి లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి
TV9 Telugu
అంతే కాదు బరువు తగ్గాలనుకునే వారికి దొండ కాయ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది. ఐరన్ లోపంతో బాధపడేవారు దొండ తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు