AC Buying Tips: కొత్త ఏసీ కొంటున్నారా? మీకు మినిమం తెలిసుండాల్సిన నాలెడ్జ్ ఇది..
ఎండాకాలం వస్తుండటంతో మార్కెట్లలో ఏసీల విక్రయాలు పెరిగాయి. ఏసీ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టాలి. రేటింగ్, వారంటీ వంటి వాటిని పరిశీలించాకే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు పీసీబీ వారంటీ ఉన్న వాటిని కొనుగోలు చేయాలి. పీసీబీ పాడైతే 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. వీటితో పాటు ఈ టిప్స్ కూడా మీకు ఏసీ కొనుగోలు విషయంలో హెల్ప్ అవుతాయి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే రానున్న వేసవికి ముందుగానే సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. బయట ధరలు పెరగకముందే ఏసీలు, కూలర్లు కొనేందుకు ఇప్పటినుంచే షాపుల ముందు క్యూ కడుతుంటారు. మరికొందరేమో ఆన్ లైన్లో ఆఫర్లను బట్టి సెలక్ట్ చేసుకుంటుంటారు. ఏసీలు ఎలా కొనుగోలు చేసినప్పటికీ వీటి విషయంలో మీకు ఎంతో కొంత సమాచారం ముందుగానే తెలిసి ఉండటం ఎంతో అవసరం.
మీ బడ్జెట్ ముందే ఫిక్స్ చేసుకోండి..
నచ్చిన షాపులోకి వెళ్లి ఏదో మంచి కంపెనీ ఏసీ కొనాలని వెళితే అది మీ ప్రయాసని పెంచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ముందుగానే మీరు ఏసీకి ఎంత బడ్జెట్ కేటాయించాలనుకుంటున్నారో తెలుసుకోండి. దానికి అనుగుణంగానే మీకు సరిపోయే నాణ్యమైన కంపెనీని ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మీ సెలక్షన్ త్వరగా పూర్తవుతుంది. లేదంటే ఏది కొనాలో తెలియక ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది.
రూమ్ సైజును బట్టి ఏసీ..
మీ గది పరిమాణం ఎంత ఉందనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. చిన్న గదులకు (సుమారు 100 నుంచి 120చదరపు అడుగులు), 1 టన్ను ఏసీ సరిపోతుంది. అదే పెద్ద గదులైతే దానికి ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఏ అంతస్తులో ఉంటున్నారో కూడా ముఖ్యమే..
మీరు పై అంతస్తులో ఉంటున్నారే అనుకోండి అక్కడ సూర్యకాంతి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్థలాన్ని బట్టి, ఉంటున్న ఫ్లోర్ ని బట్టి కూడా ఏసీ పనితీరును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి గదులను చల్లబరచడానికి ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలే అవసరం అవుతుంటాయి. సరైన కూలింగ్ ఎఫెక్ట్ కోసం ఏసీ సామర్థ్యాన్ని 0.5 టన్నుల వరకు పెంచుకోవచ్చని సూచిస్తుంటారు.
ఇంట్లో ఎంత మంది ఉంటారు..
మీ ఇంట్లో నివసించే వ్యక్తుల సంఖ్యను కూడా ఏసీ కొనుగోలు విషయంలో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రద్దీగా ఉండే గది అదనపు వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీని వలన ఏసీ కోసం పెద్ద శీతలీకరణ యూనిట్ అవసరమవుతుంది.
స్ల్పిట్ , విండో ఏసీల్లో ఏది బెటర్..
స్ల్పిట్ లేదా విండో ఏసీలు రెండూ బాగానే పనిచేస్తుంటాయి. కానీ విండో ఏసీలు సాధారణంగా తక్కువ ఫీచర్లతో ఉన్నప్పటికీ మంచి ధరకే లభిస్తుంటాయి. ఇక స్ల్పిట్ ఏసీలు ఖరాదైనవి. కానీ స్లీప్ మోడ్, టర్బో కూలింగ వంటి అదనపు ఫీచర్లను కూడా అందిస్తాయి. మీ గది అవసరాన్ని కూడా తెలుసుకుని కొనండి.
కాపర్ కాయిల్ ఏసీలు..
అల్యూమినియం కాయిల్స్ ఉన్నవాటికన్నా కాపర్ కాయిల్స్ ఉన్న ఏసీలను ఎంచుకోండం మంచిది ఎందకంటే ఇవి ఎక్కువ కూలింగ్ ను ఇస్తాయి. కాపర్ కాయిల్ ఏసీలు నిర్వణ కూడా సులభంగా ఉంటుంది. ఎక్కువ కాలం వస్తాయి.
రేటింగ్ కూడా పరిశీలించండి…
ఏసీలు వేర్వేరు స్టార్ రేటింగ్లతో వస్తాయి. చౌకైన ఏసీలు చూడ్డానికి బాగున్నప్పటికీ అవి ఎక్కువకాలం పనిచేస్తాయో లేదో తెలుసుకోండి. మీ బడ్జెట్ కి తగ్గట్టుగా కనీసం 4 లేదా 5 స్టార్ రేటింగ్ లు ఉన్న ఏసీలు తీసుకోండి. లేకపోతే కనీసం 3 స్టార్ ఉన్నవైనా మంచివే.
ఇన్వర్టర్ ఏసీలు చూడండి…
ఇన్వర్టర్ ఏసీలో పెట్టుబడి పెట్టడం మంచిదే. ఎందుకంటే ఇది విద్యుత్ వాడకాన్ని తగ్గిస్తుంది. ఏసీ సామర్థ్యాన్ని కూడా పెంచుతంది. ఈ ఫీచర్ విషయంలో రాజీ పడకండి.
అడ్వాన్డ్స్ ఏసీ ఫీచర్లు అవసరమా..
ఈ రోజుల్లో వైఫై ఎనేబుల్డ్ ఏసీలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కానీ రేటెక్కువ. మీరు తక్కువ బడ్జెట్లో ఏసీ కోసం చూస్తుంటే దీనిని స్కిప్ చేయడమే బెటర్. ఏదైనా వైఫై ఎనబుల్డ్ ఐఆర్ సెన్సార్ ను కొనుక్కున్నా మీ ఏసీనీ స్మార్ట్ ఏసీగా మార్చుకోవచ్చు. వీటి కోసం రూ.800 నుంచి రూ.1200 వరకు ఖర్చు చేస్తే సరిపోతుంది.




