AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vallabhaneni Vamsi: వంశీ కేసులో కీలక పరిణామాలు.. బెయిల్‌ పిటిషన్‌పైన తీర్పు రిజర్వ్

- ఓవైపు పదిరోజుల కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్‌... మరోవైపు బెయిల్‌ కోరుతూ లాయర్ల పిటిషన్‌... ఇంకోవైపు ఎప్పటికప్పడూ అప్‌డేట్‌ అవుతూ ఘాటెక్కిన రాజకీయం... మొత్తంగా వల్లభనేని వంశీ కేసు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది...! ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ సారి లుక్కేయండి మరి.

Vallabhaneni Vamsi: వంశీ కేసులో కీలక పరిణామాలు.. బెయిల్‌ పిటిషన్‌పైన తీర్పు రిజర్వ్
Vallabhaneni Vamsi
Ravi Kiran
|

Updated on: Feb 19, 2025 | 10:08 PM

Share

సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వంశీని 10రోజులపాటు కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వంశీ సహా ముగ్గురిని కస్టడీకి కోరారు పోలీసులు. మరోవైపు వంశీ తరపు లాయర్లు వేసిన బెయిల్‌ పిటిషన్‌పైనా విచారణ చేపట్టిన కోర్టు… తీర్పును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇటు కిడ్నాప్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వంశీ. అయితే, పోలీసుల అదుపులో ఉన్న సత్యవర్ధనే ఎవరు దాడి చేశారు..? ఎక్కడ దాడి చేశాడు..? అనేది చెబుతాడని అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

వంశీ కేసులో ఇటు పొలిటికల్‌ మంటలు నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాయి. వంశీ, సత్యవర్ధన్ ఎపిసోడ్‌లో పోటాపోటీగా వీడియోలు రిలీజ్‌ చేస్తూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారు కాబట్టే వంశీ అరెస్టయ్యారు… దీనికి పక్కా అధారాలు కూడా ఉన్నాయంటూ నిన్న సీసీటీవీ ఫుటేజ్‌ని విడుదల చేసింది టీడీపీ. ఓ లిఫ్ట్‌లో వంశీ, సత్యవర్ధన్ వెళ్తున్న వీడియోను బయటపెట్టింది. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించింది. ఇక టీడీపీ వాళ్లు వీడియో రిలీజ్ చేసిన 24 గంటల్లోనే కౌంటర్‌ ఎటాక్‌గా వైసీపీ కూడా ఓ వీడియోను విడుదల చేసింది. సత్యవర్ధన్‌ను పోలీసులే బలవంతంగా లాక్కెళ్తున్నారంటూ వీడియోను రిలీజ్‌ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. వంశీపై కేసు కేవలం రాజకీయ కక్షలోభాగమేనంటోంది. మరి మా వీడియోకు మీ సమాధానం ఏంటంటూ టీడీపీని ప్రశ్నిస్తోంది. మొత్తంగా.. ఓవైపు కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై కోర్టులో వాదనలు.. మరోవైపు పోటాపోటీగా వీడియోలు విడుదల చేస్తూ ఇరువర్గాల మాటల తూటాలు.. దీంతో వంశీ కేసు ఆసక్తికరంగా మారుతోంది. నెక్ట్స్‌ ఏంటన్న ఉత్కంఠ పెంచుతోంది. మరి కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తోందో.! చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?