Telangana Tourism: తక్కువ ధరలో తిరుపతి టూ డేస్ టూర్ ప్యాకేజీ.. ఫ్లైట్‌లో జర్నీ..
అలాకాకుండా అప్పటికప్పుడు తిరుపతి వెళ్లాలని అనుకునే వారి కోసమే తెలంగాణ టూరిజం మంచి ప్యాకేజీని అందిస్తోంది. తిరుమల శీఘ్ర దర్శన్ ఫ్రమ్ హైదరాబాద్ బై ఫ్లైట్ పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే టూర్ ముగిసేలా ఈ టూర్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఈ రెండు రోజుల్లో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం....
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అయితే తిరుమల టూర్ అనగానే రైలు టికెట్ మొదలు, దర్శనం, రూమ్ టికెట్ వరకూ అన్ని ముందస్తుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా సాఫీగా సాగాలంటే కనీసం ఒక నెల రోజుల ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాలి.
అలాకాకుండా అప్పటికప్పుడు తిరుపతి వెళ్లాలని అనుకునే వారి కోసమే తెలంగాణ టూరిజం మంచి ప్యాకేజీని అందిస్తోంది. తిరుమల శీఘ్ర దర్శన్ ఫ్రమ్ హైదరాబాద్ బై ఫ్లైట్ పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే టూర్ ముగిసేలా ఈ టూర్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఈ రెండు రోజుల్లో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయాణం ఇలా సాగుతుంది..
* మొదటి రోజు ఉదయం 6.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణం మొదలవుతుంది.
* ఉదయం 8 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు శ్రీకాలహస్తి చేరుకుంటారు.
* మధ్యాహ్నం 12 గంట వరకు దర్శనం పూర్తి చేసుకొని తిరుపతి హోటల్‌కు బయలుదేరి వెళ్తారు.
* 1.30 గంటల వరకు తిరుపతి చేరుకొని 3.30 గంటల వరకు లంచ్, విశ్రాంతి ఉంటుంది.
* అనంతరం 3.30 గంటలకు కాణిపాకం బయలుదేరి వెళ్లి 4.30 గంటలకు చేరుుంటారు.
* దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి రాత్రి 7 గంటలకు తిరుపతి చేరుకుంటారు. రాత్రి భోజనం తర్వాత బస అక్కడే ఉంటుంది.
రెండో రోజు..
* ఉదయం లేచి ఫ్రెషప్ అయిన తర్వాత 9.30 గంటలకు తిరుమల బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది.
* 10.30 గంటలకల్లా తిరుమల దర్శనం చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు దర్శనం పూర్తవుతుంది.
* తర్వాత తిరిగి తిరుపతిలోని హోటల్‌కు మధ్యాహ్నం 2 గంటల వరకు చేరు కుంటారు. 2 గంటల నుంచి 3 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది.
* మధ్యాహ్నం 3 గంటలకు పద్మావతి ఆలయానికి బయలుదేరి వెళ్తారు. అనంతరం 4.30 గంటలకల్లా దర్శనం పూర్తి చేసుకొని ఎయిర్‌పోర్ట్‌కు 5.30గంటలకు చేరుకుంటారు.
* సాయంత్రం 6.35 గంటలకు తిరుపతి నుంచి విమానంలో బయలుదేరి 7.45 గంటలకల్లా హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధర వివరాలు..
ధర విషయానికొస్తే ఒక్కొక్కరికీ రూ.15,499గా నిర్ణయించారు. ఇందులోనే హోటల్స్, దర్శనం టికెట్స్, ఫుడ్ కవర్ అవుతాయి. టికెట్ బుకింగ్, పూర్తి వివరాల కోసం తెలంగాణ టూరిజం సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్‌కు చెందిన 9848540371 నెంబర్‌ను సంప్రదించండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..