Telangana Tourism: జస్ట్ రూ. 1500కే యాదాద్రి టూర్.. ఒక్కరోజులోనే వెళ్లి రావొచ్చు..
ఇలాంటి ఓ బెస్ట్ టూరిజం ప్యాకేజే.. యాదగిరిగుట్ట టూర్ ప్యాకేజీ. హైదరాబాద్ నుంచి ఒక్క రోజులోనే యాదాద్రి ఆలయంతో పాటు మరికొన్ని ప్రదేశాలను సందర్శించేలా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ప్రతీ శనివారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మినీ ఏసీ బస్సు జర్నీ ద్వారా ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్-యాదగిరి గుట్ట పేరుతో...
సమ్మర్ హాలీడేస్ అయిపోయాయి, స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే అనుకొని కారణాలతో సమ్మర్‌లో ట్రిప్స్ వేయాల్సిన వాళ్లు వాయిదా వేయడం లేదా క్యాన్సిల్ అయ్యే ఉంటాయి. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం మంచి టూరిజం ప్యాకేజీలను అందిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే చుట్టేచ్చేలా పలు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది.
ఇలాంటి ఓ బెస్ట్ టూరిజం ప్యాకేజే.. యాదగిరిగుట్ట టూర్ ప్యాకేజీ. హైదరాబాద్ నుంచి ఒక్క రోజులోనే యాదాద్రి ఆలయంతో పాటు మరికొన్ని ప్రదేశాలను సందర్శించేలా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ప్రతీ శనివారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మినీ ఏసీ బస్సు జర్నీ ద్వారా ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్-యాదగిరి గుట్ట పేరుతో ఈ టూర్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవతాయి.? ప్యాకేజీ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..
టూర్ ఇలా సాగుతుంది..
* ఉదయం 9 గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి ప్రయాణం మొదలువుతంది.
* 10.30 గంటలకు కొలనుపాకకు చేరుకుంటారు. అక్కడున్న పురాతన జైన్ ఆలయాన్ని దర్శించుకుంటారు.
* ఇక ఉదయం 11.30 గంటలకు కొలనుపాక నుంచి బయలుదేరి వెళ్తారు.
* మధ్యాహ్నం 12:30 గంటలకు యాదగిరిగుట్ట చేరుకొని అక్కడ లక్ష్మీనర్సింహ స్వామి వారిని దర్శించుకుంటారు.
* ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2 గంటల వరకు హరిత్ హోటల్‌లో భోజనం ఉంటుంది.
* అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం 4.30 గటలకు సురేంద్రపురి దర్శనం ఉంటుంది.
* అది పూర్తికాగానే హైదరాబాద్ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు..
ప్యాకేజీ ధరల విషయానికొస్తే.. పెద్దలకు రూ. 1499గా నిర్ణయించగా, చిన్నారులకు రూ. 11999గా నిర్ణయించారు. పూర్తి వివరాలు, టికెట్స్ బుక్ చేసుకోవడానికి తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..