IRCTC: చిరు జల్లులు కురిసే వేళ, కేరళ ప్రకృతి అందాలను వీక్షిస్తే.. సూపర్ టూర్ ప్యాకేజీ
చిరు జల్లులు కురుస్తున్న సమయంలో కేరళలో ప్రకృతి అందాలను, జలపాతాలను వీక్షిస్తే ఆ కిక్కే వేరులా ఉంటుంది కదూ! ఇలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందిస్తోంది. కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. 5 రాత్రులు/6 రోజుల పాటు సాగే ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయాణం ఇలా సాగుతుంది..
* మొదటి (గురువారం) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఉదయం 11.28 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్ 17230లో బయలుదేరాల్సి ఉంటుంది.
* రాత్రంతా ప్రయాణం చేసిన తర్వాత రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు అలువా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటరాఉ. అక్కడి నుంచి మున్నర్ వెళ్లి హోటల్‌లో చెకిన్ అవుతారు. రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం మున్నార్ పట్టణం వీక్షణ ఉంటుంది. రాత్రి మున్నార్‌లోనే బస చేయాల్సి ఉంటుంది.
* ఇక మూడో రోజు ఉదయం ఎర్వికుల్ నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఈకో పాయింట్ వీక్షణ ఉంటుంది. రాత్రి బస మున్నార్‌లో ఉంటుంది.
* నాలుగో రోజు ఉదయం అల్లెప్పీ బయలుదేరి వెళ్తారు. అక్కడికి చేరుకున్న తర్వాత హోటల్‌లో చెకిన్ కావాల్సి ఉంటుంది. అక్కడ బ్యాక్ వాటర్ అందాలను వీక్షిస్తారు. రాత్రి అల్లెప్పీలోనే బస చేయాల్సి ఉంటుంది.
* ఇక 5వ రోజు ఉదయం ఎర్నాకులం తిరుగు ప్రయాణం ఉంటుంది. ఎర్నాకులం రైల్వే స్టేషన్‌లో 11.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి.
* 6వ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ వివరాలు..
ప్యాకేజీ ధర విషయానికొస్తే.. కంఫర్ట్ (3ఏ) క్యాటరీగిరలో సింగిల్ షేరింగ్‌కు రూ. 32,830, ట్విన్ షేరింగ్‌కు రూ. 19,070, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 15,590గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ విషయానికొస్తే సింగిల్ షేరింగ్‌కు రూ. 30,130, ట్విన్ షేరింగ్‌కు రూ. 16,370, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 12,880 గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..