AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Tourism: హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ

అరుణాచలం సందర్శన చేసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ముఖ్యంగా అరుణాచలం గిరి ప్రదిక్షణ చేయాలని ఆతృతతో ఉంటారు. మీరు కూడా ఈ ఆలోచనతో ఉంటే మీకోసం తెలంగాణ టూరిజం మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో కేవలం మూడు రోజుల్లోనే అరుణాచలం సందర్శన కోసం ప్యాకేజీని అందించారు. ఈ టూర్‌ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

Telangana Tourism: హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
Arunachalam
Narender Vaitla
| Edited By: Vimal Kumar|

Updated on: May 02, 2024 | 12:32 PM

Share

సమ్మర్‌ హాలీడేస్‌ వచ్చేశాయ్‌. ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు పూర్తయ్యాయి. విద్యా సంస్థలకు సెలవులు సైతం ప్రకటించారు. దీంతో చాలా మంది సమ్మర్‌ టూర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ నుంచి పలు రకాల అట్రాక్టివ్‌ ఆఫర్లను అందిస్తోంది. ఇలాంటి మంచి టూర్‌ ప్యాకేజీలో ఒక దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

అరుణాచలం సందర్శన చేసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ముఖ్యంగా అరుణాచలం గిరి ప్రదిక్షణ చేయాలని ఆతృతతో ఉంటారు. మీరు కూడా ఈ ఆలోచనతో ఉంటే మీకోసం తెలంగాణ టూరిజం మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో కేవలం మూడు రోజుల్లోనే అరుణాచలం సందర్శన కోసం ప్యాకేజీని అందించారు. ఈ టూర్‌ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

ఏప్రిల్‌ 21వ తేదీన టూర్ ఆపరేట్ చేయగా మళ్లీ మే 20వ తేదీన మళ్లీ హైదరాబాద్‌ నుంచి అరుణాచలంకు టూర్‌ను ఆపరేట్‌ చేయనున్నారు. ఇందులో భాగంగా మే 20వ తేదీన హైదరాబాద్‌ నుంచి ప్రారంభమవుతుంది.

* తొలిరోజు సాయంత్రం 6.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ ఆఫీసు నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది.

* రెండో రోజు ఉదయం 6 గంటలకు కానిపాకం చేరుకుంటారు. అక్కడ హోటల్‌లోకి వెళ్లి గంటలో ఫ్రెషప్‌ అయ్యి మళ్లీ చికవుట్ కావాల్సి ఉంటుంది.

* అనంతరం 7 గంటల నుంచి 9 గంటల వరకు కానిపాకం ఆలయ దర్శనం ఉంటుంది.

* తర్వాత ఉదయం 9 గంటలకు తిరువమనలై బయలుదేరి వెళ్తారు.

* మధ్యాహ్నం 1 గంటకు తిరువనమలై చేరుకుంటారు. అక్కడ టీటీడీసీ ఆలయమం హోటల్‌లో చెకిన్‌ అవుతారు. మధ్యాహ్నం 3 గంటల వరకు లంచ్‌ బ్రేక్‌ ఉంటుంది.

* మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు అరుణాశైలేజ్వర ఆలయం దర్శనం ఉంటుంది. రాత్రి బస అక్కడే చేయాల్సి ఉంటుంది.

* ఇక మూడో రోజు ఉదయం 10.30 గంటలకు టిఫిన్‌ చేసి హోటల్‌ నుంచి చెకవుట్‌ చేయాల్సి ఉంటుంది.

* అనంతం 10.45 గంటలకు వేలూరు గోల్డెన్‌ టెంపుల్‌ బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4 గంటల వరకు దర్శనం ఉంటుంది.

* సాయంత్రం 4.15 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడం టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర విషయానికొస్తే పెద్దలకు ఒక్కొక్కరికీ రూ. 7500గా చిన్నారులకు రూ. 6000గా నిర్ణయించారు. ఆలయాల్లో దర్శన టికెట్లు ప్యాకేజీలో కవర్‌ అవ్వవు. టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం 9848540371 నెంబర్‌కు కాల్ చేయండి.

మరిన్ని టూరిజం కథనాల కోసం క్లిక్‌ చేయండి..