AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: అయోధ్య, కాశీలను దర్శించే అద్భుత అవకాశం.. తక్కువ ధరలోనే టూర్‌ ప్యాకేజీ

అయోధ్-కాశీ పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. జూలై 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు భారత్ గౌరవ్ టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను చేపట్టింది. ఈ టూర్‌ మొత్తం 8 రాత్రులు/9 రోజులుగా సాగుతుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ప్రయాణం మొదలవుతుంది. ఈ టూర్‌లో భాగంగా అయోధ్య, కాశీ విశ్వనాథ్‌ ఆలయం, గయ వంటి ప్రాంతాలు కవర్‌ అవుతాయి....

IRCTC: అయోధ్య, కాశీలను దర్శించే అద్భుత అవకాశం.. తక్కువ ధరలోనే టూర్‌ ప్యాకేజీ
Bharat Gaurav Tourist
Narender Vaitla
|

Updated on: Jul 05, 2024 | 5:41 PM

Share

దేశంలోని పలు ప్రధాన ఆలయాలతో పాటు, పర్యాటక ప్రదేశాలను కవర్‌ చేస్తూ దక్షిణ మధ్య రైల్వేలో “భారత్ గౌరవ్” రైళ్లను నడుపుతోన్న విషయం తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRTCT) అయోధ్య బాల రామయ్యను దర్శించుకునే వారికి సూపర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా కాశీ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవచ్చు.

అయోధ్-కాశీ పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. జూలై 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు భారత్ గౌరవ్ టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను చేపట్టింది. ఈ టూర్‌ మొత్తం 8 రాత్రులు/9 రోజులుగా సాగుతుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ప్రయాణం మొదలవుతుంది. ఈ టూర్‌లో భాగంగా అయోధ్య, కాశీ విశ్వనాథ్‌ ఆలయం, గయ వంటి ప్రాంతాలు కవర్‌ అవుతాయి. ప్రయాణికులు ఈ రైల్లో తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట (వరంగల్), ఖమ్మంతో పాటు ఏపీలోని విజయవాడ, ఏలూరు , రాజమండ్రి, సామర్లకోట్ , వైజాగ్ ( పెందుర్తి ), విజయనగరం & తిట్లాగఢ్‌లలో(ఒరిస్సా) స్టేషన్స్‌లో ఎక్కొచ్చు.

ఈ రైలు ససికింద్రాబాద్ స్టేషన్‌లో వచ్చే నెల 9వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతుంది. ఇక తిరిగి 17వ తేదీన సికింద్రాబాద్‌ చేరుతుంది. ధర విషయానికొస్తే ఎకానమీ కేటగిరీ (స్లీపర్‌) ఒక్కొక్కరికీ రూ. 15,150గా నిర్ణయించారు. 3 ఏసీ విషయానికొస్తే రూ. 24,300, 2 ఏసీకి రూ. 31,500గా నిర్ణయించారు. ఇందులో అధికారులు ప్రయాణీకులకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేశారు. వసతి, ఆహారం వంటి విషయాల్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. రైలుతో పాటు రోడ్డు రవాణా, వసతి సౌకర్యం, ఉదయం టిఫిన్‌ మధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్‌తో పాటు ప్రయాణ భీమా వంటివన్నీ ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. ఆసక్తి ఉన్న వారు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా 040-27702407, 9701360701, 9281495845, 9281495843, 8287932228, 8287932229 నెంబర్లను సంప్రదించండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే