AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: బ్యాంకాక్‌ వెళ్లాలనుకునే తెలుగువారికి భారీ గుడ్‌న్యూస్.. IRCTC స్పెషల్ ప్యాకేజ్.. వివరాలు ఇవే..

బ్యాంకాక్ అందాలు చూసి తరించాలనే ఆశ చాలామందికి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది పర్యాటకులు బ్యాంకాక్‌కు వెళ్లాలనుకుంటారు. వారి కోసం ఐఆర్‌సీటీసీ మంచి టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్.. ఐదు రోజుల పాటు ఉంటుంది.

IRCTC: బ్యాంకాక్‌ వెళ్లాలనుకునే తెలుగువారికి భారీ గుడ్‌న్యూస్.. IRCTC స్పెషల్ ప్యాకేజ్.. వివరాలు ఇవే..
Irctc Tour
Venkatrao Lella
|

Updated on: Nov 21, 2025 | 10:38 AM

Share

IRCTC Bangkok Tour: విదేశీ పర్యటనలకు వెళ్లాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. కొంతమంది సింగిల్‌గా వెళితే మరికొంతమంది స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి వెళతారు. ఇక కొంతమంది కుటుంబసమేతంగా వెళతారు. అయితే విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే తెలుగు పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ తక్కువ బడ్జెట్‌తో అనేక ప్యాకేజీలు తీసుకొస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు బ్యాంకాక్ వెళ్లాలనుకునేవారి కోసం థాయ్‌లాండ్ స్పెషల్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది.

ఎన్ని రోజులు..?

ఈ టూర్ ఐదు రోజుల పాటు ఉంటుంది. నాలుగు రాత్రులు థాయ్‌లాండ్‌లో గడుపుతారు. విమాన సౌకర్యం ఉంటుంది. పిల్లలను కూడా తమతో పాటు తీసుకెళ్లవచ్చు.

ధర ఎంత..?

సింగిల్ పర్సన్‌కు అయితే రూ.62,100గా ఉంది. ఇక డబుల్ షేరింగ్ అయితే ఒక్కొ వ్యక్తికి రూ.54,200, త్రిబుల్ షేరింగ్ అయితే ఒక్కొ వ్యక్తికి రూ.53,800, ఇక చైల్డ్‌ విత్ బెడ్ అయితే ఒక్కొ వ్యక్తికి రూ.51,800, చైల్డ్ వితౌట్ బెడ్ కావాలనుకునేవారికి ఒక్కొక్కరికీ రూ.45,500గా ఉంది.

ఫ్లైట్ డీటైల్స్

వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ ట్రిప్ ప్రారంభమవుతుంది. ఫ్లైట్ నెంబర్ 6E-1067.. 11.05 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి బ్యాంకాక్‌కు వెళుతుంది. టూర్ మగిశాక మార్చి 3వ తేదీన 6E-1068 నెంబర్ గల విమానం బ్యాంకాక్ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు వస్తుంది.

బుకింగ్ ఎలా..?

ఆసక్తిగల టూరిస్టులు https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి థాయ్‌లాండ్ ప్యాకేజీ సెలక్ట్ చేసుకుని ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. పాస్‌పోర్ట్, వీసా కలిగి ఉండాలి.

సదుపాయాలు

3 స్టార్ హోటల్స్‌లో వసతి సౌకర్యంతో పాటు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కల్పిస్తారు. లోకల్ టూర్ గైడ్, ట్రావెల్ ఇన్యూరెన్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక పట్టాయాలో కోరల్ ఐలాండ్ టూర్ , అల్కాజర్ షో, నాంగ్ నౌచ్ గార్డెన్, బ్యాంకాక్‌లో మెరైన్ పార్క్‌, బ్యాంకాక్ సిటీ టెంపుల్ టూర్ , చావోఫ్రాయ డిన్నర్ క్రూయిజ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

ఏయే ప్రదేశాలు చూడొచ్చు..?

బ్యాంకాక్, పట్టాయలోని అన్ని టూరిస్ట్ ప్రదేశాలు చూపిస్తారు. తొలి రోజు హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు విమాన ప్రయాణం ఉంటుంది. రెండు రజు సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్ సందర్శన ఉంటుంది. మూడో రోజు పట్టాయలోని గోల్డెన్ బుద్ద, అల్కాజార్ షో విజిట్ ఉంటుంది. నాలుగో రోజు కోరల్ ఐలాండ్, నాంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్ సందర్శన ఉంటుంది. ఐదో రోజు షాపింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణం ఉంటుంది.

Follow Us