IRCTC Saptagiri Tour: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. కరీంనగర్, వరంగల్ నుంచి ఐదు వేలకే తిరుపతి స్పెషల్ టూర్…
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ నాలుగు దేవాలయం టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో..
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ నాలుగు దేవాలయం టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు కవర్ అవుతాయి. భక్తులు తిరుపతి చేరుకున్న తర్వాత ప్యాకేజీ మొదలవుతుంది. తిరుపతికి చేరుకునే భక్తులు శ్రీవారి దర్శనంతో పాటు ఇతర ఆలయాలను సందర్శించడం కోసం రూపొందించిన ప్యాకేజీ ఇది. 4 రోజు, 3 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ఐఆర్‌సీటీసీ సప్తగిరి టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర వివరాలను ట్విట్టర్‌లో వెల్లడించింది. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4970, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4990, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.6290 చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్ ప్యాకేజీ ధర వివరాలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6890, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.8190 చెల్లించాల్సిస్తే సరిపోతుంది.
అయితే ఈ పథకం మాత్రం కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు మాత్రమే. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందన ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది.
‘సప్తగిరి’ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల దర్శనం చేపిస్తారు. తిరుమలలో స్పెషల్ దర్శనం కల్పిస్తారు. ఈ టూర్ రైలు, రోడ్డు మార్గం ద్వారా సాగుతుంది. ప్రతీ గురువారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని ఐఆర్‌సీటీసీ ట్వీట్ చేసింది.
ఐఆర్‌సీటీసీ సప్తగిరి టూర్ ప్యాకేజీ వివరాలివే…
Offer prayers at the venerated temples of #SouthIndia with our 4D/3N ‘Sapthagiri’ train tour package starting at Rs. 5090/-pp* only. Train departs on every Thursday. #Book your journey now on https://t.co/azHT5ZohRz. *T&C Apply
— IRCTC (@IRCTCofficial) December 29, 2021
ఐఆర్‌సీటీసీ సప్తగిరి టూర్ మొదటి రోజు కరీంనగర్‌లో ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న భక్తులు 12762 నెంబర్ గల ఎక్స్‌ప్రెస్ రైలులో బయల్దేరాల్సి ఉంటుంది. ఈ రైలు రాత్రి 7.15 గంటలకు కరీంనగర్‌లో రాత్రి 8.05 గంటలకు పెద్దపల్లిలో, రాత్రి 9.15 గంటలకు వరంగల్‌లో, రాత్రి 11 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. భక్తులకు రాత్రి ప్రయాణం ఉంటుంది.
రాత్రి మొదలైన ప్రయాణం రెండో రోజు ఉదయం 7.50 గంటలకు రైలు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతికి చేరుకున్న భక్తులకు ఐఆర్‌సీటీసీ సిబ్బంది స్వాగతం చెబుతారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా భక్తులను హోటల్‌కు తీసుకెళ్తారు. ప్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల్లో దర్శనం ఉంటుంది. ఆ తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల్లో దర్శనం చేయించి తీర్త ప్రసాదాలను అందిస్తారు. రాత్రికి తిరుపతిలోనే బస చేయాల్సి ఉంటుంది.
మూడో రోజు ఉదయం టిఫిన్ పూర్తి చేసుకున్న తర్వాత హోటల్ నుంచి చెకౌట్ ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా ఉదయం 8.30 గంటలకు స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. దర్శనం పూర్తైన తర్వాత తిరిగి తిరుపతికి బయల్దేరాల్సి ఉంటుంది.
రాత్రి 8.15 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటే.. అక్కడి నుంచి 12761 నెంబర్ గల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాల్సి ఉంటుంది. తిరిగి ఆ రాత్రంతా ప్రయాణంతో ట్రిప్ ముగుస్తుంది. ప్రయాణికులు తెల్లవారుజామున 03:26 ఖమ్మంలో, 04:41 గంటలకు వరంగల్‌లో, 05:55 గంటలకు పెద్దపల్లిలో, ఉదయం 08:40 గంటలకు కరీంనగర్‌లో దిగొచ్చు. హాయిగా.. సేఫ్‌గా.. మీరు ఇంటికి చేరుకోవచ్చు. ఎక్కడ కూడా వెయిటింగ్ లేకుండా అంతా కూల్‌గా జరిగిపోతుంది ఈ ప్యాకేజీ ప్రయాణం ద్వారా ముగుస్తుంది.
స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ క్లాసులో ప్రయాణం, ఏసీ హోటల్‌లో వసతి, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్, ఇతర ఆలయాల్లో రెగ్యులర్ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి.
ఇవి కూడా చదవండి: Telangana Bandh: 317 జీవోను పునఃసమీక్షించాలని ఈ నెల 10న తెలంగాణ బంద్.. పిలుపునిచ్చిన బీజేపీ
Akkineni Nagarjuna: సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు..