IRCTC: హైదరాబాద్‌ టూ కాశీ టూర్‌ ప్యాకేజీ.. బడ్జెట్‌ ధరలో ఫ్లైట్‌ జర్నీ.

జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లాలని ప్రతీ హిందువు కోరుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి చాలా దూరం కావడం, రైలు ప్రయాణం సుమారు ఒకటిన్నర రోజులకుపైగా పట్టడంతో చాలా కాశీ వెళ్లాలని ఉన్నా చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. పోనీ విమానంలో వెళ్దామంటే ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి.? లాంటి సందేహాలు ఉంటాయి. మీలాంటి వారి కోసమే..

IRCTC: హైదరాబాద్‌ టూ కాశీ టూర్‌ ప్యాకేజీ.. బడ్జెట్‌ ధరలో ఫ్లైట్‌ జర్నీ.
IRCTC
Follow us
Narender Vaitla

|

Updated on: May 24, 2024 | 5:16 PM

జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లాలని ప్రతీ హిందువు కోరుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి చాలా దూరం కావడం, రైలు ప్రయాణం సుమారు ఒకటిన్నర రోజులకుపైగా పట్టడంతో చాలా కాశీ వెళ్లాలని ఉన్నా చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. పోనీ విమానంలో వెళ్దామంటే ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి.? లాంటి సందేహాలు ఉంటాయి. మీలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఐఆర్‌సీటీసీ గంగా రామాయణ్‌ పేరుతో ఈ స్పెషల్‌ ప్యాకేజీని అందిస్తోంది. ఇంతకీ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌ నుంచి ప్రారంభం అయ్యే ఈ యాత్ర 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఈ టూర్‌ ప్యాకేజీ జులై 20వ తేదీన అందుబాటులో ఉంది. రామాయణ్ యాత్ర పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని ఆపరేట్‌ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా వారణాసితో పాటు.. నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్‌, సారనాథ్‌ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. , వారణాసి పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు. టూర్ ప్యాకేజీలో భాగంగా ఏయే రోజు ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

* తొలి రోజు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో వారణాసి చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో కాసేపు శిశ్రాంతి తీసుకొని. భోజనం చేసిన తర్వాత కాశీ ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం గంగా ఘాట్‌ సందర్శన ఉంటుంది. రాత్రి వారణాసిలోనే బస ఉంటుంది.

* రెండో రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత సారనాథ్‌కు బయలుదేరుతారు. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం మళ్లీ వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి బిర్లా ఆలయానికి వెళతారు. రెండో రోజు రాత్రి బస కూడా వారణాసిలోనే ఉంటుంది.

* ఇక మూడో రోజు ఉదయం వారణాసి నుంచి ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. అలోపీ దేవీ ఆలయం, త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.

* నాలుగో రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వా అయోధ్య ఆలయ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం లఖ్‌నవు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.

* ఇక ఐదవ రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత నైమిశారణ్యానికి బయలుదేరుతారు. రోజంతా అక్కడే గడపాల్సి ఉంటుంది. సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.

* ఆరవ రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత లఖ్‌నవూలోని చారిత్రక కాంప్లెక్స్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి హోటల్‌ చేరుకుంటారు. ఇక సాయంత్రం 4 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. దీంతో యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ ధర వివరాలు..

ప్యాకేజీ ధర విషయానికొస్తే.. సింగిల్‌ ఆక్యుపెన్సీ- రూ.39,400, డబుల్‌ ఆక్యుపెన్సీ- రూ.31,000, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ- రూ.29,850, చైల్డ్‌ విత్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.27,650, చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.23,050, చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (2- 4ఏళ్లు)- రూ.17,400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో విమాన టికెట్లతో పాటు, హోటల్‌, టిఫిన్‌, రాత్రి భోజనం ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. అయితే మధ్యాహ్నం భోజనం మాత్రం ఒక రోజే ఉంటుంది. ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ప్యాకేజీలోనే కవర్‌ అవుతుంది. ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..