IRCTC: మండె ఎండల్లో కశ్మీర్‌ టూర్‌.. ఐఆర్‌సీటీసీ నుంచి ఫ్లైట్‌ జర్నీ ప్యాకేజీ..

మిస్టికల్ కశ్మీర్‌ ఎక్స్‌ హైదరాబాద్‌ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీల ధర వివరాలు ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా. హైదరాబాద్‌ నుంచి విమాన ప్రయాణంలో కొనసాగే ఈ టూర్‌ ప్యాకేజీ ఏప్రిల్‌ 12, 15, 19, 24 తేదీల్లో అందుబాటులో ఉండనుంది...

IRCTC: మండె ఎండల్లో కశ్మీర్‌ టూర్‌.. ఐఆర్‌సీటీసీ నుంచి ఫ్లైట్‌ జర్నీ ప్యాకేజీ..
IRCTC
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 19, 2024 | 2:42 PM

ఎండకాలం ఎంట్రీ ఇచ్చేసింది. మరికొన్ని రోజుల్లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికైనా టూర్‌ వెళ్లాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ ఓ సూపర్‌ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. మండె ఎండల్లో కశ్మీర్‌ అందాలను వీక్షించే అవకాశం కల్పించింది.

మిస్టికల్ కశ్మీర్‌ ఎక్స్‌ హైదరాబాద్‌ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీల ధర వివరాలు ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందా. హైదరాబాద్‌ నుంచి విమాన ప్రయాణంలో కొనసాగే ఈ టూర్‌ ప్యాకేజీ ఏప్రిల్‌ 12, 15, 19, 24 తేదీల్లో అందుబాటులో ఉండనుంది. మొత్తం ఆరు పగళ్లు, 5 రాత్రల్లు సాగే ఈ టూర్‌లో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయో ఇప్పుడు చూద్దాం..

* తొలి రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌ నెంబర్‌ 6ఈ-108 విమానంలో ప్రయాణం మొదలవుతుంది. శ్రీనగర్‌ ఎయిర్‌ పోర్ట్‌కు సాయంత్రం 5.25 గంటలకు చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్‌ అవుతారు.

* రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత సోన్‌ మార్గ్ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కొన్నిప్రదేశాలను సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌ చేరుకుంటారు.

* మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత గుల్‌మార్గ్ ప్రయాణం ఉంటుంది. అక్కడ పలు ప్రదేశాలను సందర్శిస్తారు.

* ఇక నాల్గవ రోజు పహాల్గమ్‌ సందర్శన ఉంటుంది. అక్కడ పలు ప్రాంతాలను సందర్శించిన తర్వాత తిరిగి రాత్రి హోటల్‌కు చురుకుంటారు.

* 5వ రోజు ముగల్‌ గార్డెన్స్‌, బొటానికల్ గార్డెన్‌, షాలిమార్‌ గార్డెన్స్‌తో పాటు శంకరాచార్య ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి హౌజ్‌ బోట్‌ డిన్నర్‌ ఉంటుంది.

* ఇక చివరి రోజైన ఆరవ రోజు ఉదయం శ్రీనగర్‌ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది. హైదరాబాద్ విమానశ్రయానికి చేరడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు..

సింగిల్‌ ఆక్యూపెన్సీ కంఫర్ట్‌ క్లాస్‌కు రూ. 58,565గా నిర్ణయించారు. ఇక డబుల్ ఆక్యూపెన్సీకి రూ. 52,930 కాగా ట్రిపుల్‌ ఆక్యూపెన్సీకి రూ. 51,300గా నిర్ణయించారు. అలాగే చైల్డ్‌ విత్‌ బెడ్‌ (5 నుంచి 11 ఏళ్ల మధ్య) వారికి రూ. 41,210గా నిర్ణయించారు. చైల్డ్‌ వితవుట్ బెడ్ అయితే రూ. 37,990గా ధరలను నిర్ణయించారు. టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం కథనాల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!