IRCTC: సమ్మర్‌లో తిరుపతి ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? IRCTC ప్యాకేజ్‌తో బిందాస్‌గా వెళ్లి రావొచ్చు. తక్కువ ధరలోనే..

తిరుపతి వెళ్లాలని చాలా మంది ప్లాన్‌ చేస్తుంటారు. ముఖ్యంగా సెలవులు వచ్చాయంటే చాలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో నెలల ముందు నుంచే రూమ్, ట్రావెల్‌, దర్శనం ఇలా అన్నింటినీ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి టెన్షన్స్‌ ఏవీ లేకుండా చాలా ఈజీగా..

IRCTC: సమ్మర్‌లో తిరుపతి ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? IRCTC ప్యాకేజ్‌తో బిందాస్‌గా వెళ్లి రావొచ్చు. తక్కువ ధరలోనే..
Irctc Govindam Package
Follow us
Narender Vaitla

|

Updated on: May 13, 2023 | 4:22 PM

తిరుపతి వెళ్లాలని చాలా మంది ప్లాన్‌ చేస్తుంటారు. ముఖ్యంగా సెలవులు వచ్చాయంటే చాలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో నెలల ముందు నుంచే రూమ్, ట్రావెల్‌, దర్శనం ఇలా అన్నింటినీ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి టెన్షన్స్‌ ఏవీ లేకుండా చాలా ఈజీగా తిరుపతి ట్రిప్‌ వేసే అవకాశాన్ని కలిపిస్తోంది ఐఆర్‌సీటీసీ. గోవిందం పేరుతో మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. తక్కువ ఖర్చులో ఎలాంటి టెన్షన్‌ లేకుండా బిందాస్‌గా తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఈ టూర్‌ మొత్తం 2 రాత్రులు, 3 రోజులు సాగుతుంది.

ప్రతీ రోజూ అందుబాటులో ఉండే ఈ టూర్‌ ప్యాకేజ్‌ ద్వారా కేవలం రెండు రోజుల్లోనే టూర్‌ వేసి రావొచ్చు. ఈ ప్యాకేజ్‌ ద్వారా వెళితే తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా పొందొచ్చు. అంతేకాకుండా ప్యాకేజ్‌ ధర కూడా రూ. 4 వేలలోపే ఉండడం విశేషం. ఇంతకీ ఈ టూర్‌లో ఏయే ప్రాంతాలు కవర్‌ చేస్తారు. హైదరాబాద్‌ నుంచి తిరుమల ఉండే ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

* మొదటి రోజు: గోవిందం టూర్‌ ప్యాకేజీ బుక్‌ చేసుకున్న పర్యాటకులు మొదటి రోజు 12734 నెంబర్‌ రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఈ రైలు లింగంపల్లిలో 5.25 గంటలకు, సికింద్రాబాద్‌లో 6.10 గంటలకు, నల్లగొండలో రాత్రి 7.38 గంటలకు ఆగుతుంది. మొదటి రోజంతా రైలు ప్రయాణం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* రెండో రోజు: మరుసటి రోజు తెల్లవారు జాముఎన ఉదయం 5.55 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో ఫ్రెషప్‌ అయిన తర్వాత తిరుమలకు బయలు దేరాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. అనంతరం తిరుపతికి చేరుకుంటారు. హోటల్‌లో లంచ్‌ చేసిన తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. రెండో రోజు సాయంత్రం 6.25 గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుంది. ప్రయాణికులు 12733 నెంబర్‌ రైలు ఎక్కాల్సి ఉంటుంది.

* మూడో రోజుల తెల్లవారు జామున ఉదయం 3.04 గంటలకు నల్గొండలో, 5.35 గంటలకు సికింద్రాబాద్‌లో, 6.55 గంటలకు లింగంపల్లిలో రైలు ఆగుతుంది. ఇక్కడితో టూర్ ముగుస్తుంది.

ధర ఎల ఉంటుందంటే..

ఈ ప్యాకేజీలో రెండు రకాల ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 3,800 రూపాయిలు, డబుల్ షేరింగ్ ధర రూ. 3,800 కాగా సింగిల్ షేరింగ్ ధర రూ. 4,950 రూపాయిలుగా నిర్ణయించారు. కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 5,660, డబుల్ షేరింగ్ ధర రూ. 5,660, సింగిల్ షేరింగ్ ధర రూ. 6,790 గా ఉంది. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం, స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, ఏసీ హోటల్‌లో బస, ఏసీ వాహనంలో రవాణా, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..