AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hill Stations: ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్నారా.. ఈ హిల్‌ స్టేషన్‌లు మీకు బెస్ట్‌..

Hill Stations: మీరు ప్రకృతిలో స్వేచ్చగా విహరించాలంటే ఉత్తరఖండ్‌లోని ఈ హిల్‌స్టేషన్లు బెస్ట్‌ అని చెప్పవచ్చు. పర్యాటకంగా ఇవి ఉత్తమ ప్రదేశాలు.

Hill Stations: ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్నారా.. ఈ హిల్‌ స్టేషన్‌లు మీకు బెస్ట్‌..
Hill Stations
uppula Raju
|

Updated on: Nov 18, 2021 | 6:03 AM

Share

Hill Stations: మీరు ప్రకృతిలో స్వేచ్చగా విహరించాలంటే ఉత్తరఖండ్‌లోని ఈ హిల్‌స్టేషన్లు బెస్ట్‌ అని చెప్పవచ్చు. పర్యాటకంగా ఇవి ఉత్తమ ప్రదేశాలు. నిత్యం ఎంతోమంది ఇక్కడి అందాలను తిలకిస్తారు. పర్యటకులతో ఈ ప్రాంతాలు కిటకిటలాడుతాయి. ఈ హిల్ స్టేషన్ మంత్రముగ్ధులను చేసే అందంతో పాటు చుట్టూ ఉన్న ఇతర ప్రదేశాలకు కూడా ప్రసిద్ధి. ముస్సోరీ సమీపంలో ఉండే హిల్ స్టేషన్ల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. కనాటల్ కనాటల్‌ హిల్‌ స్టేషన్‌ చాలా అందమైన ప్రదేశం. ఇది ముస్సోరీ, ఢిల్లీ, చంబా, రిషికేశ్ వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలకు సమీపంలో ఉంటుంది. పర్యాటకులు వారాంతాల్లో సందర్శించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇక్కడ మీరు సుర్కంద దేవి ఆలయం, కోడియా ఫారెస్ట్, టెహ్రీ సరస్సు వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

2. డెహ్రాడూన్ హిమాలయాల దిగువన ఉన్న డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాజధాని. ఇది సహజ దృశ్యాలకు నెలవు. చిన్న పట్టణం అయినప్పటికీ ఇతర ప్రసిద్ధ హిల్ స్టేషన్లకు గట్టి పోటీనిస్తుంది. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం సంవత్సరం పొడవునా సందర్శకులను ఆకర్షిస్తుంది. డెహ్రాడూన్ నగరం ఉత్తర భారతదేశంలోని ఇతర నగరాలకు బాగా అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఇక్కడికి రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

3. తెహ్రీ ఉత్తరాఖండ్‌లోని జిల్లాల్లో ఒకటైన తెహ్రీలో అత్యంత అందమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ మీరు వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలాన్ని చూడవచ్చు. నదులు, పర్వత భూభాగం భూమిపై స్వర్గంలా అనిపిస్తాయి. ఈ ప్రదేశం పర్యాటక ఆకర్షణలలో ఒకటి టెహ్రీ డ్యామ్. ఇది ఆసియాలోనే ఎత్తైన అతిపెద్ద ఆనకట్ట. ఇది కాకుండా మీరు రాక్ క్లైంబింగ్, రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్ వంటి వాటిని ఆస్వాదించవచ్చు.

4. ధనౌల్తి ఇక్కడ నుంచి మీరు హిమాలయాల గంభీరమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఓక్, దేవదార్, రోడోడెండ్రాన్ చెట్లను తిలకించవచ్చు. సంప్రదాయ గర్వాలీ ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. స్థానిక సావనీర్‌లను కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా చాలా కోటలు, దేవాలయాలు, తోటలు, అడవులు తిరుగుతూ గడపవచ్చు.

5. చక్రతా హిల్ స్టేషన్ చక్రతా హిల్ స్టేషన్ పర్యటకులకు మంచి ప్రదేశం. ఇది డెహ్రాడూన్ నుంచి 90 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ మీరు అనేక రకాల వృక్షజాలం, జంతుజాలాన్ని చూడగలరు. ఇది కాకుండా జలపాతాలు, అందమైన పర్వత మార్గాలు సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇక్కడ మీరు సైక్లింగ్ ఎంచుకోవచ్చు.

IND vs NZ: ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన 6 ఏళ్ల బాలిక.. ఏ విషయంలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

విటమిన్‌ ‘E’ లేకుంటే శరీరంలో ఈ రెండు పనిచేయవు..! అందుకే ఈ 5 ఆహారాలు తప్పనిసరి..