Shirdi Temple: కోవిడ్ కేసులు తగ్గుముఖం.. రోజుకు షిర్డీ ఆలయ దర్శనానికి మరో 10వేల మంది భక్తులకు అనుమతి..

Shirdi Temple: COVID -19 కేసుల తగ్గుముఖం పట్టడంతో అహ్మద్ నగర్ జిల్లా యంత్రాంగం షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తుల దర్శనం సంఖ్య పెంచింది. మరో  10,000 భక్తులు అనుమతిస్తూ..

Shirdi Temple: కోవిడ్ కేసులు తగ్గుముఖం.. రోజుకు షిర్డీ ఆలయ దర్శనానికి మరో 10వేల మంది భక్తులకు అనుమతి..
Shirdi Temple
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2021 | 2:32 PM

Shirdi Temple: కోవిడ్ -19 కేసుల తగ్గుముఖం పట్టడంతో అహ్మద్ నగర్ జిల్లా యంత్రాంగం షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తుల దర్శనం సంఖ్య పెంచింది. మరో  10,000 భక్తులు అనుమతిస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఆఫ్లైన్ పాస్లు కలిగిన వారు షిర్డీ సాయిబాబాని దర్శించుకోవచ్చునని తెలిపింది.  అక్టోబర్ 6న ఆన్‌లైన్ లో రోజుకు 15 వేలమందికి బాబా  దర్శనానికి  అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. అయితే రోజువారీ కేసుల తగ్గుదల దృష్ట్యా, సాధారణ భక్తులను కూడా దర్శనానికి అనుమతినివ్వాలనే ప్రతిపాదనకు అధికారులు అంగీకరించారు.  ఓ వైపు 15,000 మంది భక్తుల దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ కొనసాగుతుంది. అంటే మొత్తం రోజుకు 25,000 మంది భక్తులు ఇప్పుడు ప్రతిరోజూ సాయిబాబా దర్శనం చేసుకోవచ్చు.

“సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, అన్ని కోవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ..  రోజూ 10,000 మంది భక్తులు సాధారణ దర్శనం చేసుకోవచ్చు.  ఈ మేరకు అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర  అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. .

అడ్మినిస్ట్రేషన్ , మహారాష్ట్ర ప్రభుత్వం సూచించిన అన్ని కోవిడ్-19 నియమాలను పాటిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ కు భక్తులు తగిన పాత్రలను చూపించాల్సి ఉంటుంది. తమ ఆధార్ కార్డులను చూపించిన భక్తులకు ఉచితంగా దర్శనం చేసుకునే పాస్‌లను పంపిణీ చేయడానికి షిర్డీలో కౌంటర్లను ఏర్పాటు చేయనున్నామని  శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది.

మహారాష్ట్రలో COVID-19  కేసుల సంఖ్య వేయి కంటే తక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 886 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ,  34 మరణాలు నమోదయ్యాయి.

Also Read :  రేపు ఏపీ తీరాన్ని తాకనున్న అల్పపీడనం.. రాగల మూడురోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..