AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourist Spot: ఇండియాలో స్వచ్ఛమైన గాలిని కలిగిన 5 ప్రదేశాలివే.. శీతాకాలంలో ఇక్కడికి వెళ్లండి..!

Tourist Spot: నగరాల్లో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం ప్రత్యేక ప్రదేశాలను వెతుక్కుంటూ వెళుతున్నారు. మీరు కూడా విహారయాత్రలకు వెళ్తున్నట్లయితే..

Tourist Spot: ఇండియాలో స్వచ్ఛమైన గాలిని కలిగిన 5 ప్రదేశాలివే.. శీతాకాలంలో ఇక్కడికి వెళ్లండి..!
Tourist Spots
Shiva Prajapati
|

Updated on: Dec 17, 2021 | 10:59 PM

Share

Tourist Spot: నగరాల్లో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం ప్రత్యేక ప్రదేశాలను వెతుక్కుంటూ వెళుతున్నారు. మీరు కూడా విహారయాత్రలకు వెళ్తున్నట్లయితే.. దేశంలో కాలుష్యం లేని, స్వచ్ఛమైన గాలి వీచే అద్భుతమైన 5 ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడ వాతావరణ అద్భుతమని చెప్పాలి.

నగరాల అభివృద్ధితో పాటు కాలుష్య సమస్య కూడా తీవ్రమవుతోంది. తాజాగా ప్రపంచ వాయు నాణ్యత సూచికను ట్రాక్ చేసే ఐక్యూ ఎయిర్ అనే సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రదేశంగా నిలిచింది. ఇక భారతదేశంలోని అనేక నగరాలు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ కాలుష్య ప్రభావం అక్కడ నివసించే ప్రజలపై తీవ్రంగా పడుతోంది. నగరాల్లో కాలుష్యపూరిత గాలిని పీల్చడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెలవుల్లో బయటకు వెళ్లాలంటే స్వచ్ఛమైన గాలి ఉండే ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. భారతదేశంలో గాలి స్వచ్ఛంగా ఉండే ఐదు ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం శీతాకాలంలో ఏ నగరాల్లో పర్యటించవచ్చో ఇప్పుడు చూద్దాం..

1. ఐజ్వాల్ (మిజోరం)- భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన గాలి వీచే నగరాలలో ఐజ్వాల్ ఒకటి. ఇక్కడ తక్కువ ఖర్చుతో అందమైన ప్రదేశాలను సందర్శించి ఆనందించవచ్చు. ఖవాంగ్లాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం, వంత్వాంగ్ జలపాతాలు, టామ్‌డిల్ సరస్సు, బుర్రా బజార్, మిజోరాం స్టేట్ మ్యూజియం, డర్ట్‌లాంగ్ హిల్స్, రెయిక్ హెరిటేజ్ విలేజ్ ఐజ్వాల్‌లో చూడదగిన కొన్ని ప్రదేశాలు.

2. కోయంబత్తూర్ (తమిళనాడు) – మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలవబడే కోయంబత్తూరులో గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ అందమైన రాష్ట్రంలో అనేక ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో పశ్చిమ కనుమలపై దాదాపు 500 అడుగుల ఎత్తులో ఉన్న మరుధమలై ఆలయం ప్రముఖమైనది. ఆలయంలోని ద్రావిడ శిల్పకళ చూడదగ్గది. ఇది కాకుండా, మీరు కోయంబత్తూర్‌లోని ఆదియోగి శివ విగ్రహం, వైదేహి జలపాతం, కోవై కొండట్టం, పేరూర్ పటేశ్వరార్ ఆలయం, సిరువాణి జలపాతాలు మొదలైన ప్రదేశాలను ఆస్వాదించవచ్చు.

3. అమరావతి (ఆంధ్రప్రదేశ్) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అమరావతి ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణ. ఈ నగరం పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. అమరావతిలో మీరు హరికేన్ పాయింట్, భీమ్ కుండ్, అంబాదేవి టెంపుల్, ఛత్రీ తలాబ్, వడాలి తలాబ్, సతీధామ్ టెంపుల్ వంటి అందమైన ప్రదేశాలను ఆస్వాదించవచ్చు.

4. దావణగెరె (కర్ణాటక)- కర్ణాటకలోని దావణగెరె దాని సహజ, సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలోని పరిశుభ్రమైన గాలి ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ మీరు కుందువాడ కెరె, ఈశ్వర్ మందిర్, బతి గుడ్డ, బేతూర్, బాగ్లీ వంటి పర్యాటక ప్రదేశాలను ఆస్వాదించవచ్చు.

5.విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)- విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రసిద్ధ నగరం, ఇది ప్రశాంతమైన బీచ్‌లతో బీచ్ ప్రేమికులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది . ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్, కటికి జలపాతాలు, బొర్రా గుహలు, INS కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, కైలాసగిరి, ఋషికొండ బీచ్, అకాకు వ్యాలీ, వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం వంటి అద్భుతమైన పర్యాటక ఆకర్షణలకు నగరం ప్రసిద్ధి చెందింది. Also read:

Winter skin care tips: ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోండి.. చాలా ఈజీ..

Side Effects of Turmeric: పసుపును అధికంగా వినియోగిస్తున్నారా?.. ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Hyderabad Police: రాచకొండ పోలీస్ కమిషనేరట్ పరిధిలో పలువురు పోలీసు అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీపీ..

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ