AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon hill Stations: వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందం చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. సేఫ్ అండ్ సెక్యూర్ పర్వత ప్రాంతాలు ఇవే..

కొత్త కొత్త ప్రదేశాల్లో పర్యటించడం ఇష్టమా..! అది కూడా వర్షాకాలంలో మన దేశంలోని పర్వత ప్రాంతాలను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే వర్షాకాలంలో కూడా మీరు ఎటువంటి భయం లేకుండా ప్రకృతిని ఆస్వాదించగల కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలకు భయపడితే ఈ ప్రదేశాలకు వెళ్లేందుకు ట్రై చేయండి.

Monsoon hill Stations: వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందం చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. సేఫ్ అండ్ సెక్యూర్ పర్వత ప్రాంతాలు ఇవే..
Monsoon Hill Stations India
Surya Kala
|

Updated on: Jun 27, 2025 | 5:35 PM

Share

వర్షాకాలంలో ప్రజలు తరచుగా పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి వెనుకాడతారు. ఎందుకంటే ఈ సమయంలో పర్వతాలపై వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య ప్రాంతంలోని కొండ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే సంఘటనలు కనిపిస్తాయి. ఇది ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి మాత్రమే కాదు పర్యాటకుల సెలవులను కూడా పాడు చేస్తుంది.

అటువంటి పరిస్థితిలో.. వర్షాకాలంలో ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి.. ప్రమాదాలను నివారించాలనుకునే వారికి, కొండచరియలు విరిగిపడే ప్రమాదం చాలా తక్కువగా లేదా దాదాపుగా లేని కొన్ని హిల్ స్టేషన్లు ఉన్నాయి. కనుక ఈ రోజు భారతదేశంలోని నాలుగు ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. ఇవి వర్షాకాలంలో కూడా పూర్తిగా సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. సందర్శించడానికి కూడా చాలా అందంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మధ్యప్రదేశ్ లోని పంచమర్హి కొండచరియలు విరిగిపడకుండా ఉండాలనుకుంటే.. పంచమర్హి మంచి గమ్యస్థానం. ఇది మధ్యప్రదేశ్‌లోని సాత్పురా కొండలలో ఉన్న ఒక హిల్ స్టేషన్, ఇది అందంగా, సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ భూమి రాతితో కూడుకున్నది. కనుక ఇక్కడ కొండచరియలు విరిగిపడే సంఘటనలు చాలా తక్కువ. వర్షాకాలంలో ఇక్కడి పచ్చదనం, జలపాతాలు, గుహలు చూడదగినవి. ప్రకృతిని ఆస్వాదించడానికి, తక్కువ జనసమ్మర్థం ఉన్న ప్రదేశం ఇది.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

లోనావాలా మంచి ఎంపిక. పూణే, ముంబై మధ్య ఉన్న లోనావాలా వర్షాకాలంలో సందర్శించదగిన ప్రసిద్ధ వారాంతపు విహార ప్రదేశం. ఇది మీకు హిల్ స్టేషన్ పూర్తి వైబ్‌ను అందిస్తుంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా చాలా తక్కువ. వర్షాకాలంలో ఇక్కడి జలపాతాలు, పచ్చదనం, భూషి ఆనకట్ట, రాజ్‌మాచి కోట చూడదగినవి. సురక్షితమైన రోడ్లు, మెరుగైన కనెక్టివిటీ దీనిని కుటుంబంతో సందర్శించడానికి సరైన ప్రదేశంగా చేస్తాయి.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

మౌంట్ అబూ రాజస్థాన్ లోని ఏకైక హిల్ స్టేషన్ అయిన మౌంట్ అబూ ఆరావళి పర్వత శ్రేణిలో ఉంది. ఈ ప్రాంతం ఘనమైన రాళ్లతో రూపొందించబడింది. కనుక ఇక్కడ కొండచరియలు విరిగిపడే ప్రమాదం లేదు. వర్షాకాలంలో ఇక్కడ హాయిగా తిరగవచ్చు. నక్కీ సరస్సు, గురు శిఖర్, దిల్వారా ఆలయం వంటి ప్రదేశాలు వర్షాకాలంలో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే తక్కువ వర్షపాతం తర్వాత కూడా.. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది.

సరిస్కా టైగర్ రిజర్వ్ ఆరావళి శ్రేణిలో ఉన్న సరిస్కా టైగర్ రిజర్వ్ వర్షాకాలంలో ప్రకృతి ప్రేమికులకు ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడి భూమి దృఢంగా , సమతలంగా ఉంటుంది. కనుక కొండచరియలు విరిగిపడే ప్రమాదం లేదు. మీరు ఇక్కడ వన్యప్రాణుల సఫారీ, అడవిలో వాకింగ్, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. వర్షాకాలంలో ఇక్కడికి వెళ్తే ఇక్కడి పచ్చదనం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. అలాగే ఈ సీజన్‌లో ఇక్కడ అనేక జంతువులను చూడవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..