- Telugu News Photo Gallery Spiritual photos Mahalakshmi Yoga on June 29th: Which Zodiac Signs Will Benefit
Mahalakshmi Yoga: 2 రోజుల తర్వాత ఏర్పడనున్న మహాలక్ష్మి యోగం.. ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు
జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు, రాశుల్లో సంచరించడం వలన అనేక శుభ యోగాలు ఏర్పడతాయి. జూన్ 29న మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఈ నేపధ్యంలో మహాలక్ష్మి యోగం అంటే ఏమిటి? ఈ శుభ యోగం ఏ రాశిలో ఏర్పడుతుందో తెలుసుకుందాం. ఏ రాశులకు దీని వల్ల ప్రయోజనం ఉంటుందో కూడా తెలుసుకుందాం..
Updated on: Jun 27, 2025 | 4:02 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు.. రాశులు, నక్షత్రరాశులు తిధులలో జరిగే కలయిక ద్వారా శుభ యోగం ఏర్పడుతుంది. లక్ష్మీ యోగం చాలా శుభ యోగంగా పరిగణించబడుతుంది. చంద్రుడు, కుజుడు కలయిక వల్ల లక్ష్మీ యోగం ఏర్పడుతుంది.

ఇప్పటికే కుజుడు సింహరాశిలో ఉన్నాడు. జూన్ 29న చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. ఈ చంద్రుని సంచారం సింహరాశిలో మహాలక్ష్మి యోగాన్ని సృష్టిస్తుంది. చంద్రుడు ఒక రాశిలో దాదాపు రెండున్నర రోజులు ఉంటాడు.

నవ గ్రహాలలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహం. చంద్రుడు జూన్ 29న కర్కాటక రాశి నుంచి బయలుదేరి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 1 వరకు సింహరాశిలో ఉంటాడు. ఈ సమయంలో సింహరాశిలో మహాలక్ష్మీ యోగం ఏర్పడుతుంది.

మహాలక్ష్మి యోగం ఒక అందమైన, శుభప్రదమైన యోగం. చంద్రుడు, కుజుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఇది జాతకుడికి జీవితంలో విజయాన్ని తెస్తుంది. అతను పురోగతి, గౌరవాన్ని పొందుతాడు.

వృషభ రాశి వారికి మహాలక్ష్మి యోగం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రజలు మీ పని విధానాన్ని ఇష్టపడతారు. ఈ రాశికి చెందిన వ్యక్తుల వృత్తి, వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు.

సింహ రాశిలో మహాలక్ష్మి యోగం ఏర్పడటం వల్ల కన్యా రాశి వారికి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమయంలో కన్యా రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

మకర రాశి వారికి మహాలక్ష్మి యోగం ఏర్పడటం వల్ల పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో మీ పని పూర్తి చేసుకోవచ్చు. మీకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ధన లాభం పొందే అవకాశం ఉంది.




