వాస్తు టిప్స్ : మీ మొబైల్ వాల్ పేపర్‌గా ఇవి పెట్టుకన్నారో.. జీవితం నాశనమే!
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే పండితులు తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, మొబైల్ ఫోన్‌లో ఈ మూడు రకాల వాల్ పేపర్స్ అస్సలే పెట్టుకోకూడదంట. దీని వలన ప్రతికూలతలు చోటు చేసుకునే అవకాశం ఉందంట. కాగా, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Updated on: Jun 27, 2025 | 7:10 PM

వాస్తు శాస్త్రం చాలా శక్తివంతమైనది అంటారు. ఎందుకంటే? ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మన చుట్టూ ఉండే ప్రతి వస్తువు అది దానికి సరైన స్థానంలో లేకపోతే అది ప్రతికూల లేదా సానుకూల ప్రభావాలను చూపుతూ ఉంటుంది. అందుకే వాస్తు నిపుణులు, తప్పకుండా ఏ పని చేసినా వాస్తు నియమాలను కూడా పాటించాలని సూచిస్తుంటారు. అయితే ఇది ఇల్లు, ఇంటి వాతావరణం వంటివాటికే పరిమితం కాదంట. మనం చేతిలో పట్టుకునే మొబైల్ ఫోన్‌కు కూడా వర్తిస్తుందంటున్నారు వారు.

వ్యక్తి జీవితంలో మొబైల్ ఫోన్ అనేది కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. అందుకే దీని విషయంలో కూడా తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలంట. వాస్తు శాస్త్రంలో మొబైల్ ఫోన్ వాల్ పేపర్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే. ఒక వ్యక్తి తన ఫోన్‌కు వాల్ పేపర్ పెట్టుకోవడానికి ఎన్నింటినో ప్రయత్నిస్తాడు. కొన్ని సార్లు తమ భావోద్వేగాల ప్రకారం వాల్ పేపర్ పెట్టుకుంటారు.

అయితే ఇది కూడా వారి వ్యక్తిత్వం, జీవితంపై ప్రభావం చూపుతుందంట.మనం ఎంచుకునే మొబైల్ వాల్‌పేపర్ మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మన జీవితం ఎలాటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోవడానికి, పాజిటివ్ వైబ్స్ కోసం తప్పకుండా స్క్రీన్ పై పెట్టే వాల్ పేర్స్ విషయంలో కూడా చాలా వరకు ఆలోచించి పెట్టుకోవాలంట. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

చాలా మంది ఎక్కడ ఎలాంటి ప్రదేశంలో ఉన్నా సరే వారి చేతిలో మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది. ఇక కొంత మంది అయితే ఏకంగా బాత్ రూమ్‌కి వెళ్లినా సరే మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్తుంటారు. మురికి ప్రదేశాల్లో, దహనసంస్కారాలు ఇలా ఎక్కడ ఉన్న కూడా ఫోన్ చేతిలో ఉండటం అనేది కామన్. అందువలన మొబైల్ వాల్ పేర్ అనేది ఒక మతపరమైన స్థలం, దేవాలయాలది అస్సలే పెట్టుకోకూడదంట. మీరు వెళ్లే ప్రదేశాల్లో ఆ వాల్ పేపర్ ఉండటం అనేది దేవతలను అవమానించడమేనంట. అందుకే అలాంటి వాల్ పేపర్ పెట్టకూడదంట.

ప్రజలు తరచుగా తమ తమ భావోద్వేగాలతో కూడిన వాల్‌పేపర్‌లను పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఉదాహరణకు విచారం, మరణం, కోపం, అసూయ లేదా దురాశను ఇలా వారు ఉండే స్థితిని బట్టి వాల్ పేపర్ పెట్టుకుంటారు. అయితే భావోద్వేగాలతో కూడిన వాల్‌పేపర్‌లను మొబైల్‌లో ఉంచడం వల్ల జీవితంలో ప్రతికూలత పెరుగడమే కాకుండా నిరాశ కూడా ఆవహిస్తుందంటున్నారు పండితులు. అలాగే దేవుళ్ల ఫొటోలు కూడా వాల్ పేపర్‌గా పెట్టుకోకూడదంట. దనీి వలన ఇది మీ జాతకంలో గ్రహదోషాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు.



