మార్నింగ్ కాదండోయ్..రాత్రి పూట గ్రీన్ టీతాగితే బోలెడు లాభాలు!
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే ఉదయమే కాకుండా, రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం వలన కూడా బోలెడు లాభాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 27, 2025 | 7:08 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దవారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని మీ హెల్త్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటారు. ఇక ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు, డ్రింక్స్‌లో గ్రీన్ టీ కూడా ఒకటి. ఇది బరువు నియంత్రణకు చాలా దోహదం చేస్తుంది. కానీ చాలా మంది దీనిని ఉదయం తాగడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే రాత్రి పడుకునే సమయంలో ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతే కాకుండా ఇది నిద్రనాణ్యతను కూడా మెరుగుపరుస్తుందంట.

ఇక రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం వలన ఇందులో ఉండే కెఫిన్, ఎల్-థియనిన్‌లు మానసిక స్థితిపై సానుకూల ప్రభావాలను చూపుతాయంట. ఇది మీ మనసుకు హాయినిస్తుందంట. అంతే కాకుండా మెదడు పనితీరు కూడా మెరుగుప పడేలా చేసి అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుందంట. అందువలన ప్రతి రోజూ రాత్రి ఒక కప్పు గ్రీన్ టీ తాగడం, మానసిక,శారీరక ఆరోగ్యానికి, విశ్రాంతి తీసుకోవడానికి గొప్ప మార్గం అంటున్నారు నిపుణులు.

Green Tea

హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన ప్రకారం, పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందంట. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంట. ఎందుకంటే? పడుకునే సమయంలో గ్రీన్ టీ తాగడం వలన ఇది రక్తంలో ట్రైగ్లిజరైడ్స్,కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందంట. మరీ ముఖ్యంగా రోజుకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగేవారికి స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు వారు తెలుపుతున్నారు.

ఏ వ్యక్తి అయినా సరే కనీసం, ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి అంటారు. అయితే రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం వలన ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుందంట. ప్రస్తుతం చాలా మంది ఈరోజుల్లో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం వలన టీలోని ఎల్ థియనిన్ అనే ఆమైనో ఆమ్లం మంచి విశ్రాంతినివ్వడమే కాకుండా ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుందంట.



