AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mansarovar Yatra: ఆరేళ్ల తర్వాత మానస సరోవరానికి చేరుకున్న భారతీయులు.. యాత్రికుల అనుభవాలు ఏమిటంటే

హిందువుల నమ్మకం ప్రకారం కైలాస మానసరోవర పర్వతం సృష్టికి లయకారుడైన శివుడి నివాసంగా పరిగణించబడుతుంది. ఇది టిబెటన్ పీఠభూమిలో ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాలలో ఒకటి. కైలాస మానస మానస సరోవర యాత్ర చేయడం ప్రతి హిందువు జీవిత కల. తమ జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని భావిస్తారు. ఈ కైలాష్ మానస సరోవరం యాత్ర దాదాపు 6 సంవత్సరాల తర్వాత జూన్ 21న పునఃప్రారంభమైంది. 23 నుంచి 25 ​​రోజుల పాటు సాగనున్న ఈ ఈ తీర్థయాత్ర గురించి తెలుసుకుందాం..

Mansarovar Yatra: ఆరేళ్ల తర్వాత మానస సరోవరానికి చేరుకున్న భారతీయులు.. యాత్రికుల అనుభవాలు ఏమిటంటే
Kailash Mansarovar Yatra
Surya Kala
|

Updated on: Jun 27, 2025 | 3:41 PM

Share

దాదాపు ఆరు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. పవిత్ర కైలాస మానస సరోవర యాత్ర తిరిగి ప్రారంభమైంది. కోవిడ్-19 మహమ్మారి, గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా నిలిపివేయబడిన ఈ తీర్ధయాత్ర చివరకు మళ్ళీ మొదలైంది. తమ జీవితంలో ఒకసారైనా కైలాస మానస సరోవర తీర్థయాత్ర చేయాలనుకున్న భక్తుల కోరిక నేరేవేరే అవకాశం నెలకొంది. జూన్ 21వ తేదీన 750 మంది భారతీయ యాత్రికుల మొదటి బృందం సిక్కింలోని నాథు లా పాస్ ద్వారా టిబెట్‌లోకి తీర్థయాత్ర కోసం ప్రవేశించింది. ఇది చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌. ఈ సంవత్సరం ఈ యాత్ర కోసం 5,500 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ఈ దరఖాస్తుదారుల నుంచి 750 మంది యాత్రికులను ఎంపిక చేసింది.

జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏటా నిర్వహించే ఈ యాత్ర రెండు నియమించబడిన మార్గాల ద్వారా నిర్వహించబడుతోంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ , సిక్కింలోని నాథు లా పాస్. ఈ తీర్థయాత్ర 23 నుంచి 25 రోజుల పాటు సాగనుంది. ఈ తీర్ధయత్రలో సుమారు 45 కి.మీ.ల సవాలుతో కూడిన ట్రెక్ ఉంటుంది.

ప్రయాణంలోని యాత్రికుల అనుభవాలు ఏమిటంటే

ఇవి కూడా చదవండి

“హర్ హర మహాదేవ్”, “ఓం నమః శివాయ” అని నినాదాలు చేస్తూ భక్తులు తమ తీర్ధయత్రను ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. మానస సరోవర సరస్సు ఒడ్డున పవిత్ర గంగా జలాన్ని చల్లుకుంటూ.. చాలా మంది భావోద్వేగానికి లోనయ్యారు. పవిత్ర జలాల్లో స్నానం చేయడం నిషేధం కొనసాగుతున్న నేపధ్యంలో ఈ సరస్సులో అడుగు పెట్టడం నదిలోని నీటిని బకెట్ ద్వారా తీసుకుంటారు. లేదా నది నీటిని నెత్తిమీద జల్లుకుని జీవితకాలంలో తెలిసి తెలియక చేసిన పాపాలను కడిగివేస్తుందని భక్తులు నమ్ముతారు.

తన యత్రానుభవాన్ని ఒక పర్యాటకుడు తెలియజేస్తూ మొత్తం విశ్వం కైలాసం చుట్టూ కేంద్రీకృతమై ఉందని చెబుతారు. ఈ ప్రదేశం విశ్వానికి కేంద్రంగా నమ్ముతారు. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి ఉన్నాము కనుక ఈ సమయంలో తన భావాలను ఎలా వ్యక్తం చేయాలో మాటలు రావడం లేదని చెప్పారు. మరొక భక్తుడు చేతులు జోడించి.. “నేను కనుగొన్న గొప్ప బలం.. శివుని ఆశీర్వాదాలు” అని శివయ్య పట్ల భక్తిని తెలియజేశాడు.

ఈ బృందంలోని పర్యాటకుల్లో అతి చిన్న ప్రయాణీకుడుకి 20 సంవత్సరాలు, పెద్దవారికీ 69 సంవత్సరాలు. ఈ బ్యాచ్‌లోని ప్రతి సభ్యుడు పరిక్రమను విజయవంతంగా పూర్తి చేశారు. ఇది దైవిక ఆశీర్వాదం కంటే తక్కువ కాదు” అని ఒక మహిళా యాత్రికురాలు అన్నారు. ఈ మానస సరోవరం దగ్గర దృశ్యాలు హృదయన్ని కదీలించే దృశ్యాలు మనసులో చిరకాలం నిలిచిపోతాయని ఒక వృద్ధ మహిళ అక్కడ దృశ్యాలను తెలిపింది. అదికూడా తన అనుభవాలను ఆ వృద్ధురాలు చేతి సంజ్ఞలు ద్వారా వ్యక్తపరిచాయి, ఆమె తన చేతులను ఆకాశం వైపు పైకెత్తి తలపైకి దించి.. ఆశీర్వాదాలు తీసుకుంది. సున్నితమైన చిరునవ్వుతో.. చేతులు జోడించి, పవిత్ర జల బిందువులు ఆమె చర్మంపై మెరుస్తున్నట్లు ఆమె నిశ్చలంగా ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు