Europe Travel: కేవలం రూ.50 వేలతో యూరప్‌ను ఈ దేశాలను చుట్టేయండి.. 7 రోజుల టూర్ కోసం వెంటనే రెడీ అవ్వండి..
ఏడాది చివర్లో ఎక్కడికైనా అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లాలనుకుంటే ఈ దేశాలు మీకు స్వాగతం పలుకుతున్నాయి. ఎందుకంటే ఈ దేశాల్లో పర్యటించడం పెద్ద ఖర్చు ఉండదు. మన దేశ రాజధాని ఢిల్లీ, వ్యాపార రాజధాని ముంబై నగరాల్లో పర్యటించిన ఖర్చు కంటే తక్కువలో ఇక్కడ టూర్ వేయవచ్చు. అంతే కాదు ఆ దేశ అందాలు కూడా చూసి రావంచ్చు.

యూరప్ అంటే భూతల స్వర్గం అని చెప్పవచ్చు. సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. యురేషియా భూఖండం పశ్చిమాత్య ద్వీపకల్పం. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, ఆగ్నేయాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం , నల్లసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న కాలువలు సరిహద్దులుగా ఉన్నాయి. గత దశాబ్దంలో భారతదేశం నుంచి ఐరోపాను సందర్శించే వారి సంఖ్య భారీగా పెరిగింది. నిజానికి విదేశీ పర్యటనలు జరుపుకోవాలంటే భారీ బడ్జెట్ కావాలి. ఉదాహరణకు, ఒక దేశంలో జీవించడానికి, తినే ఖర్చు లక్షకు పైగా ఉంటుంది. కానీ యూరోప్‌లోని చాలా దేశాల్లో జీవించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇక్కడ మీరు మీ కుటుంబంతో కేవలం రూ. 50,000 (50K)తో హాయిగా ప్రయాణించవచ్చు. యూరప్‌లోని ఈ చౌకైన, ఉత్తమ ప్రయాణ గమ్యస్థానాల గురించి తెలుసుకుందాం..
పోర్చుగల్..
దక్షిణ ఐరోపాలో ఉన్న పోర్చుగల్ అందమైన బీచ్‌లు, రుచికరమైన ఆహార పదార్థాలు, అందమైన గ్రామీణ ప్రాంతాలకు ప్రసిద్ధి చెందింది. ఈ దేశం సర్ఫింగ్, గోల్ఫ్ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. పోర్చుగల్ ఫాడో సంగీతం కారణంగా ఈ ప్రదేశం చాలా ప్రజాదరణ పొందింది. పోర్చుగల్‌లోని మంచి స్టార్ హోటల్ ఒక రోజు ఖర్చు రూ.1500 నుంచి రూ. 2500లను మాత్రమే అవుతుంది.
స్లోవేనియా
ఐరోపా గురించి మాట్లాడుకుంటే.. స్లోవేనియా చాలా చిన్న దేశం. దీని సరిహద్దు మూడు అందమైన ప్రదేశాలతో అంటే.. అందులో హంగరీ, ఇటలీ, ఆస్ట్రియాతో కలిసి ఉంటుంది. ఈ దేశం చుట్టూ పర్వతాలు, అడవులు ఉన్నాయి. మీ రోజువారీ బడ్జెట్‌కు స్లోవేనియా కూడా సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ ఒక మంచి బెస్ట్ స్టార్ హోటల్ ఒక రోజు అద్దె రూ. 3000 నుంచి రూ. 6000ల మధ్య ఉంటుంది.




బల్గేరియా
బల్గేరియా అందైన ప్రదేశాలకు పెట్టింది పేరు ఈ దేశం. చాలా ఆకర్షణీయమైన పర్వతాలు, ఇసుక బీచ్‌లు చాలా ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తాయి. ఇక్కడి ఈ టూరిస్ట్ ప్రదేశాలకు ప్రతి రోజు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ఆహారం, బస కోసం రోజువారీ బడ్జెట్ అంటే కేవలం రూ. 1500 నుంచి రూ. 2000ల మధ్య ఉంటుంది. నోయిడా, ఘజియాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లోని ఏదైనా స్ట్రీట్ ఫుడ్ మార్కెట్‌లో మీరు ఈ మొత్తాన్ని సులభంగా ఖర్చు చేయవచ్చు.
స్లోవేకియా
స్లోవేకియా ప్రాచీన అందాలకు పెట్టింది పేరు. ఇక్కడ పాత రాజభవనం, బ్రాటిస్లావన్, అందమైన పర్వతాలు ఇక్కడ మనను ఆకట్టుకుంటాయి. ఏడాది పొడవునా విదేశీ పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ ఆహారం, హోటల్ ఖర్చు దాదాపు రూ. 2000 నుంచి రూ. 4000లు మాత్రమే.
క్రొయేషియా
క్రొయేషియా చుట్టూ బీచ్‌లు, నీలి జలాలు, అద్భుతమైన ద్వీపాలు ఉన్నాయి. మీరు ఇక్కడ బోటింగ్, స్నార్కెలింగ్, కయాకింగ్ వంటి సాహస కార్యకలాపాలను కూడా చేయవచ్చు. ఇక్కడ మీ ఒక రోజు బస, ఆహారం మొత్తం ఖర్చు రోజుకు రూ. 3000 నుంచి రూ. 4000 లు మాత్రమే అవుతుంది.
అయితే ఇంకెందుకు ఆలస్యం యూరప్ చుట్టేసేందుకు మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇందు కోసం చాలా టూరిజం ప్యాకేజీలు రెడీగా ఉన్నాయి.
మరిన్ని టూరిజం వార్తల కోసం
