Insomnia: రాత్రి మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. రీజన్ ఇదే..
ఏ పని చేయకుండా అలసిపోవడం సడన్‌గా కళ్లు తిరగడం లేదా మసకబారడం, ఏకాగ్రతను కోల్పోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం, డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలను ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ నిద్ర లేకపోవడంతో వచ్చే సమస్యలను నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిపూట పడుకునే ముందు కొన్ని తప్పులు చేయడం వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని వారు చెప్తున్నారు. ఏంటి ఆ తప్పులు ? దాని వల్ల వచ్చే సమస్యలేంటి ?
చాలామందికి నిద్ర రాకపోవడానికి కారణం స్లీపింగ్ హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తి కాకపోవడమే. రాత్రి ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్, స్మార్ట్ టీవీ, ఎలక్ట్రానిక్ డివైస్ వంటివి చూడడం వల్ల ఈ రకమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గాడ్జెట్స్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కంటిపై, మెదడుపై ప్రభావం పడుతుంది. అందుకే నిద్రకు ఉపక్రమించే ముందు నుంచి ఎలక్ట్రానిక్ డివైస్‌కు దూరంగా ఉండటం బెటర్ అని చెబుతున్నారు.
రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ, పాలు తాగడం లేదా చిప్స్, స్వీట్ లాంటివి తినడం చేస్తుంటారు. అయితే కాఫీ టీలు కెఫెన్ కంటెంట్‌ను కలిగి ఉండటం వల్ల నిద్ర రాకుండా చేస్తాయి. చిప్స్, స్వీట్స్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచడానికి కారణం అవుతాయి. కాబట్టి పడుకునే ముందు వీటిని అవాయిడ్ చేయడం బెటర్. రెగ్యులర్ లైఫ్‌లో ప్రతి విషయానికి సరైన షెడ్యూల్ మెయింటైన్ చేయడం… రోజు పడుకోవడానికి, నిద్ర లేవడానికి ఒకే రకమైన టైం టేబుల్ ఫాలో అవుతే కంటికి ఇలాంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
మార్నింగ్ టైమ్‌లో ఎక్ససైజ్ కి టైం లేనివారు ఫిట్నెస్ కోసం రాత్రి సమయంలో వర్కవుట్స్ చేస్తుంటారు. అయితే తిన్న వెంటనే కాసేపు నడక అవసరం కానీ నిద్రకు ముందు వ్యాయామాలు మాత్రం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ముఖ్యంగా రాత్రులు హెవీ వర్కౌట్స్ చేయడం నిద్ర దూరం అవడానికి కారణం అవుతుందట. రాత్రి నిద్ర పట్టకపోవడానికి స్ట్రెస్, యాంగ్జైటిస్, కూడా మరో ప్రధాన కారణం. మంచి నిద్ర ఉంటేనే మన బాడీ ట్రాక్‌లో ఉంటుంది. క్వాలిటీ స్లీప్ లేకపోతే.. భవిష్యత్‌లో చాలా సమస్యలు వస్తాయ్. అందుకే నిద్రను లైట్ తీసుకోకండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..