Marble Temple: ఇంట్లోని పాలరాతి దేవుడి గుడి తళతళ మెరవాలంటే.. ఈ చిట్కాలు బెస్ట్..

| Edited By: Janardhan Veluru

Sep 30, 2024 | 5:19 PM

సాధారణంగా ఏ ఇంట్లో అయినా దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం కేటాయిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఒక దగ్గర దేవుడికి సంబంధించిన ఒక షెల్ఫ్ ఏర్పాటు చేస్తారు. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు సిమెంట్ లేదా చెక్క, పాలరాయితో, గ్రానైట్‌తో అందంగా అలకరిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది పాలరాయితోనే ఇంట్లోని దేవుడికి ప్రత్యేకంగా షెల్ఫ్‌లు కట్టిస్తున్నారు. పాలరాయితో కట్టించిన షెల్ఫ్ ఎంతో అందంగా ఉంటాయి. ఎక్కువగా తెలుపు రంగు పాలరాయినే..

Marble Temple: ఇంట్లోని పాలరాతి దేవుడి గుడి తళతళ మెరవాలంటే.. ఈ చిట్కాలు బెస్ట్..
Kitchen Hacks
Follow us on

సాధారణంగా ఏ ఇంట్లో అయినా దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం కేటాయిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఒక దగ్గర దేవుడికి సంబంధించిన ఒక షెల్ఫ్ ఏర్పాటు చేస్తారు. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు సిమెంట్ లేదా చెక్క, పాలరాయితో, గ్రానైట్‌తో అందంగా అలకరిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది పాలరాయితోనే ఇంట్లోని దేవుడికి ప్రత్యేకంగా షెల్ఫ్‌లు కట్టిస్తున్నారు. పాలరాయితో కట్టించిన షెల్ఫ్ ఎంతో అందంగా ఉంటాయి. ఎక్కువగా తెలుపు రంగు పాలరాయినే ఉపయోగిస్తారు. కానీ రోజులు గడిచే కొద్దీ మరకలు పడి అంద విహీనంగా కనిపిస్తుంది. దీపాల పొగ, కుంకుమ, పసుపు మరకలు, ధూళి, ఆయిల్ కారణంగా పాల రాయి అనేది మురికిగా మారుతాయి. మామూలుగా క్లీన్ చేసినా.. ఈ మురికి అనేది పోదు. కానీ పండుగుల సమయంలో మీ దేవుడి షెల్స్ అందంగా కనిపించాలంటే.. ఈ చిట్కాలు ఎంతో చక్కగా పని చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

డిష్ వాష్ లిక్విడ్:

పాలరాయి తెల్లగానే ఉంటుంది. మరి ఇలాంటి పాలరాయి మరింత తెల్లగా మెరిసిపోతూ ఉండేందుకు డిష్ వాష్ లిక్విడ్ ఎంతో చక్కగా సాయ పడుతుంది. ముందుగా ఒక చిన్న గిన్నెలోకి డిష్ వాష్ లిక్విడ్ తీసుకోండి. అందులో కొద్దిగా నీరు పోయండి. ఆ తర్వాత ఒక చిన్న క్లాత్ లేదా స్క్రబ్బర్ తీసుకుని పాలరాయిని రుద్దండి. ఆ తర్వాత మళ్లీ మంచి నీటితో కడిగితే.. దేవుడి షెల్ఫ్ క్లీన్ అవుతుంది. ఎంతో తెల్లగా మెరుస్తుంది.

హ్యాండ్ వాష్:

హ్యాండ్ వాష్ లిక్విడ్‌తో కూడా మనం పాలరాయిని క్లీన్ చేయవచ్చు. ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల హ్యాండ్ వాస్ వేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి స్పూన్‌తో కలపండి. దీన్ని ఇప్పుడు పాలరాయి మీద చల్లండి. అనంతరం ఒక స్క్రబ్బర్‌తో రుద్ది క్లీన్ చేయాలి. అనంతరం పొడి వస్త్రంతో తుడిస్తే మీ దేవుడి గూడు ఎంతో తెల్లగా మెరుస్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా సహాయంతో కూడా పాలరాతిపై ఉండే మరకలు పోగొట్టవచ్చు. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా నీళ్లు, కొద్దిగా సర్ఫ్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ వాటర్‌ని చల్లి ఓ రెండు నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది.. మంచి నీటితో క్లీన్ చేయాలి. నెక్ట్స్ పొడి క్లాత్‌తో తుడిస్తే పాలరాయి ఎంతో చక్కగా మెరుస్తుంది. మరకలు కూడా పోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.