AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedy: మీ వాష్ బేసిన్‌ మురికిగా మారిందా..? ఈ వంటింటి చిట్కాలతో తళతళ మెరిసిపోతుంది!

Home Remedy: వాష్ బేసిన్ పై నిరంతరం నీరు పడటం వల్ల దానిపై కాల్షియం, ఖనిజాల పొర పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. సబ్బు నురుగు, టూత్ పేస్టు కణాలు, దుమ్ము కూడా దానికి అంటుకుని పసుపు రంగులోకి మారి మురికిగా కనిపిస్తుంది. వీటిని సకాలంలో శుభ్రం చేయకపోతే ఈ మరకలు..

Home Remedy: మీ వాష్ బేసిన్‌ మురికిగా మారిందా..? ఈ వంటింటి చిట్కాలతో తళతళ మెరిసిపోతుంది!
Subhash Goud
|

Updated on: Sep 11, 2025 | 8:03 PM

Share

Home Remedy: రోజుల్లో ప్రతి ఇంట్లో వాష్ బేసిన్‌ను రోజుకు చాలాసార్లు ఉపయోగిస్తున్నారు. నీరు, సబ్బు మరకలు ఏర్పడుతుంటాయి. క్రమంగా ఈ మరకలు గట్టిపడి బేసిన్‌పై పసుపు, మురికి పొరను ఏర్పరుస్తాయి. తరచుగా మనం వాటిని గట్టిగా రుద్దడం ద్వారా శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తాము. కానీ చాలాసార్లు ఈ మొండి మరకలు పోవు. అటువంటి పరిస్థితిలో వాష్ బేసిన్ మురికిగా, వికారంగా కనిపిస్తుంది. మార్కెట్లో లభించే ఖరీదైన క్లీనర్లతో కూడా చాలా సార్లు మరకలు పూర్తిగా తొలగిపోవు. బడ్జెట్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. వంటగదిలో ఉండే కొన్ని వస్తువులతోనే వాష్‌ బెసిన్‌ను మెరిసేలా చేసుకోవచ్చు. నిమ్మకాయ, బేకింగ్ సోడాతో తయారు చేసిన ఈ దేశీ క్లీనర్ మీ వాష్ బేసిన్‌ను ఒకేసారి మెరిసేలా చేస్తుంది.

వాష్ బేసిన్లపై పసుపు మరకలు ఎందుకు వస్తాయి?

వాష్ బేసిన్ పై నిరంతరం నీరు పడటం వల్ల దానిపై కాల్షియం, ఖనిజాల పొర పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. సబ్బు నురుగు, టూత్ పేస్టు కణాలు, దుమ్ము కూడా దానికి అంటుకుని పసుపు రంగులోకి మారి మురికిగా కనిపిస్తుంది. వీటిని సకాలంలో శుభ్రం చేయకపోతే ఈ మరకలు మరింత మురికిగా కనిపిస్తాయి. తర్వాత వాటిని తొలగించడం కష్టమవుతుంది.

ఇవి కూడా చదవండి

మొండి మరకలు పోగొట్టే టిప్స్‌:

  • 2 నిమ్మకాయలు
  • 1 టీస్పూన్ బేకింగ్ సోడా
  • 1 కప్పు గోరువెచ్చని నీరు

ఈ మూడు వస్తువులు కూడా మీరు మీ ఇంట్లోనే ఉంటాయి. వాటితో తయారు చేసిన ద్రావణానికి మీరు ఎటువంటి రసాయనాలను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

శుభ్రపరిచే ద్రావణాన్ని ఎలా తయారు చేయాలి?:

ముందుగా ఒక నిమ్మకాయను రెండు భాగాలుగా కట్ చేసి దాని రసాన్ని తీయండి. ఇప్పుడు ఈ రసంలో బేకింగ్ సోడా కలపండి. మీరు దానిని కలిపిన వెంటనే అది నురుగు ఏర్పడుతుంది. దానిని బాగా కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్ మీ వాష్ బేసిన్ పై పేరుకుపోయిన మరకలు, ధూళిని శుభ్రం చేయడానికి సరైనది.

ఎలా ఉపయోగించాలి:

ఈ పేస్ట్‌ను వాష్ బేసిన్‌పై పసుపు మరకలు లేదా ధూళి ఉన్న చోట రాయండి. నిమ్మకాయ, బేకింగ్ సోడా ఆమ్లం వాటి పనిని చేసేలా 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. సమయం ముగిసిన తర్వాత బేసిన్‌ను గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రమైన గుడ్డతో తుడవండి. మరకలు మాయమై బేసిన్ కొత్తగా కనిపిస్తుంది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మరకలను సులభంగా పోగొడుతుంది. బేకింగ్ సోడా తేలికపాటి స్క్రబ్బర్‌గా పనిచేస్తుంది. ఎక్కువ రుద్దకుండానే మురికిని తొలగిస్తుంది. ఈ రెండింటి కలయిక మీకు సహజమైన, ప్రభావవంతమైన క్లీనర్‌ను అందిస్తుంది.

Wash Basin1

ముఖ్యమైన చిట్కాలు:

  • మరకలు పడకుండా ఉండటానికి ఈ ద్రావణాన్ని వారానికి కనీసం రెండుసార్లు వాడండి.
  • మరకలు చాలా పాతవి అయితే పేస్ట్ వేసిన తర్వాత వాటిని తేలికపాటి స్క్రబ్బర్‌తో రుద్దండి.
  • మీరు నిమ్మకాయకు బదులుగా వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. ఇది కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుంది.
  • మీకు సువాసన కావాలంటే ఈ ద్రావణంలో కొన్ని చుక్కల నిమ్మకాయ, కూకింగ్‌ ఆయిల్‌ను జోడించవచ్చు.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..