Green Tea for Women: ఆడవాళ్లు గ్రీన్ టీ తాగితే జరిగేది ఇదే.. డోంట్ మిస్!
గ్రీన్ టీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ తాగుతున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా లభ్యమవుతాయి. అయితే చాలా మంది గ్రీన్ టీని బరువు తగ్గేందుకు కూడా తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా చర్మం ఆరోగ్యం, గుండె ఆరోగ్యం..

గ్రీన్ టీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ తాగుతున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా లభ్యమవుతాయి. అయితే చాలా మంది గ్రీన్ టీని బరువు తగ్గేందుకు కూడా తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా చర్మం ఆరోగ్యం, గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇలా గ్రీన్ టీతో ఒక్కటేంటి? చాలా రకాల ఉపయోగాలే ఉన్ానయి. మరి గ్రీన్ టీ ఆడవారు తాగితే ఏం జరుగుతుంది? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సంతానోత్పత్తి:
చాలా మంది మహిళలు సంతానోత్పత్తి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు గ్రీన్ టీ తాగడం వల్ల సంతానోత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం చాలా మితంగా గ్రీన్ టీ తీసుకోవాలి. లేదంటే రక్త హీనత, ఫోలిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి.
ఎముకలు బలంగా ఉంటాయి:
ఆడవారు గ్రీన్ టీ తాగడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎందుకంటే మహిళలు అనేక పనులు చేస్తూ ఉంటారు. దీంతో ఎముకలు బలహీనంగా తయారవుతాయి. కాబట్టి గ్రీన్ తాగితే ఎముకలు బలంగా ఉంటాయి. హార్మోన్లను కూడా హెచ్చుతగ్గులకు కాకుండా తగ్గిస్తుంది.
జీర్ణ సమస్యలు మాయం:
మహిళలు గ్రీన్ టీ తాగితే.. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ప్రేగుల ఆరోగ్యానికి కూడా గ్రీన్ టీ సహాయ పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. మెటబాలిజం రేటును పెంచుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకుంటే మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. వాంతులు, వికారం, అజీర్తి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
అనేక పోషకాలు:
ఆడవారు గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఇందులో జింక్, మాంగనీస్, క్రోమియం, సెలెనమ్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్య పోషకాలు లభ్యమవుతాయి. ఇవి మహిళలను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








