Teeth Whitening Tips: ఈ టిప్స్ పాటించారంటే.. మల్లె పువ్వుల్లా దంతాలు తెల్లగా మెరుస్తాయ్!
పళ్లు తెల్లగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ కొంత మందికి మాత్రం పళ్లు పసుపుపచ్చ రంగులో, పసుపు రంగులో ఉంటాయి. పళ్లు మిలమిలమని మెరుస్తూ ఉంటే.. ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. పళ్లు పసుపు రంగులో ఉంటే నలుగురిలో నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. పసుపు పళ్లు అనేవి అనారోగ్యాన్ని కూడా తెచ్చి పెడతాయి. దంతాలు పసుపుగా, కాంతి హీనంగా మారడానికి..

పళ్లు తెల్లగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ కొంత మందికి మాత్రం పళ్లు పసుపుపచ్చ రంగులో, పసుపు రంగులో ఉంటాయి. పళ్లు మిలమిలమని మెరుస్తూ ఉంటే.. ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. పళ్లు పసుపు రంగులో ఉంటే నలుగురిలో నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. పసుపు పళ్లు అనేవి అనారోగ్యాన్ని కూడా తెచ్చి పెడతాయి. దంతాలు పసుపుగా, కాంతి హీనంగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల కూడా దంతాలు అనేవి పసుపు రంగులో ఉంటాయి. వీటి రంగు మార్చడానికి రెగ్యులర్‌గా క్లీనింగ్ చేసినా.. దంతాలు పసుపు రంగు మారవు. అలాంటి వారు ఈ చిట్కాలను ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడాను పేస్ట్‌గా చేసి దానితో పళ్లు తోముకోవాలి. బేకింగ్ సోడా పళ్లపై ఉండే పసుపు మరకలను పోగొడుతుతంది. లేదంటే బేకింగ్ సోడా పేస్టులో అయినా కొద్దిగా కలిపి యూజ్ చేయవచ్చు. అలాగే సాల్ట్, బేకింగ్ సోడా కలిపి అయినా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మెరుస్తాయి. దుర్వాసన కూడా తగ్గుతుంది.
పసుపు:
పసుపుతో కూడా దంతాలపై ఉండే పసుపు మరకలను పోగొట్టవచ్చు. పళ్లలో పలు ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇవి పళ్లను తెల్లగా మారుస్తాయి. పసుపును పేస్ట్‌గా చేసి పళ్లపై రుద్దండి. అలాగే మీరు వాడే పేస్టులో అయినా కలిపి ఉపయోగించవచ్చు.
నిమ్మ రసం:
నిమ్మ రసం ఉపయోగించి కూడా పళ్లను తెల్లగా మార్చోవచ్చు. ఉదయం మీరు బ్రష్ చేసే సమయంలో.. నిమ్మ రసంలో కొద్దిగా సాల్ట్ కలిపి ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల పసుపు రంగు తగ్గి.. దంతాలు తెల్లగా మెరుస్తాయి.
మామిడి ఆకులు లేదా పండ్లు:
మామిడి ఆకులు లేదా పండ్లతో కూడా మీ పళ్ల సమస్యల్ని తగ్గించుకోవచ్చు. లేత మామిడి ఆకులు తీసుకుని పేస్టు రూపంలో చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్టును.. దంతాలపై తోముకోవాలి. ఇలా చేయడం వల్ల పసుపు రంగు తగ్గుతుంది. అలాగే బాగా పండిన మామిడి పండు గుజ్జుతో కూడా పళ్లను శుభ్రంగా తోముకుంటే.. దంతాలపై ఉండే పసుపు రంగు తగ్గుతుంది. అలాగే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








