Kitchen Hacks: ఈ టిప్స్ పాటించారంటే.. గ్యాస్ స్టవ్ ఎక్కువ రోజులు వస్తుంది..

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు మహిళలు ఎక్కువగా ఉండేది వంటింట్లోనే. టీతో మొదలై.. రాత్రి పాలతో ఎండ్ అవుతుంది. ఇలా గ్యాస్ స్టవ్‌తో బోలెడు పనులు ఉన్నాయి. ఇలా గ్యాస్‌ స్టవ్ మీద ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి గ్యాస్ స్టవ్ సరిగా పని చేయకపోతే ఆ రోజు ఎలాంటి పులు సాగవు. కాబట్టి గ్యాస్‌ స్టవ్‌ని చక్కగా మెయింటెన్స్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ ఎక్కువ రోజులు రావాలంటే దాన్ని ఎంతో జాగ్రత్తగా వాడాలి. చాలా మంది ఎలా పడితే అలా యూజ్..

Kitchen Hacks: ఈ టిప్స్ పాటించారంటే.. గ్యాస్ స్టవ్ ఎక్కువ రోజులు వస్తుంది..
Kitchen Hacks
Follow us

|

Updated on: Oct 07, 2024 | 1:08 PM

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు మహిళలు ఎక్కువగా ఉండేది వంటింట్లోనే. టీతో మొదలై.. రాత్రి పాలతో ఎండ్ అవుతుంది. ఇలా గ్యాస్ స్టవ్‌తో బోలెడు పనులు ఉన్నాయి. ఇలా గ్యాస్‌ స్టవ్ మీద ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి గ్యాస్ స్టవ్ సరిగా పని చేయకపోతే ఆ రోజు ఎలాంటి పులు సాగవు. కాబట్టి గ్యాస్‌ స్టవ్‌ని చక్కగా మెయింటెన్స్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ ఎక్కువ రోజులు రావాలంటే దాన్ని ఎంతో జాగ్రత్తగా వాడాలి. చాలా మంది ఎలా పడితే అలా యూజ్ చేస్తూ ఉంటారు. దీని వల్ల గ్యాస్ స్టవ్ త్వరగా పాడైపోతుంది. మళ్లీ కొత్తవి కొనాలంటే ఖర్చు పెరుగుతుంది. అయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఎక్కువ రోజులు గ్యాస్ స్టవ్ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

బర్నర్లు క్లీన్:

గ్యాస్ స్టవ్ ఎక్కువ రోజులు మన్నాలంటే బర్నర్లను ఖచ్చితంగా శుభ్రం చేస్తూ ఉండాలి. బర్నర్ల క్లీనింగ్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే బర్నర్ల నుంచే గ్యాస్ అనేది సరఫరా అవుతుంది. బర్నర్లపై కూడా జిడ్డు, మురికి అనేది పేరుకుపోతుంది. కాబట్టి వీటిని సరిగా శుభ్రం చేయకపోతే.. మంట సరిగా రాదు. దీంతో గ్యాస్ వృథా అవుతుంది. కాబట్టి బర్నర్లను నెలకు రెండు సార్లు అయినా క్లీన్ చేస్తూ ఉండాలి.

పై నుంచి టీ, అన్నం, కూరలు వండేటప్పుడు పొంగినప్పుడు వీటిలోకి మురికి చేరిపోతుంది. వేడి నీటిలో కొద్దిగా సర్ఫ్, వెనిగర్, బేకింగ్ సోడా వేసి ఓ పది నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత వీటిని బ్రష్‌తో బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల బర్నర్ల పైన ఉన్న మురికి, జిడ్డు పోతుంది.

ఇవి కూడా చదవండి

వెంటనే శుభ్రం చేయండి:

గ్యాస్ స్టవ్‌ మీద ఒక్కోసారి పాలు, టీ, అన్నం, కూరల మరకలు పడుతూ ఉంటాయి. తర్వాత క్లీన్ చేద్దాంలే అలాగే వదిలేస్తారు. ఈ మరకలు అలా ఉండి జిడ్డుగా మారి వదలవు. కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

నీళ్లతో కడగకూడదు:

చాలా మంది గ్యాస్ స్టవ్‌ మీద నీళ్లు పోసి కడుగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల త్వరగా తుప్పు పట్టేస్తుంది. అలా కాకుండా స్పాంజ్ లేదా క్లాత్ సహాయంతో స్టవ్ కడగాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..