AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mood Swings: ఆడవాళ్లకు ఇది అమృతం లాంటిది..! ప్రతిరోజూ 1 చెంచా తిన్నారంటే ఫుల్‌ జోష్‌..

కొన్ని విత్తనాల మిశ్రమం మహిళలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా ప్రకారం, మిశ్రమ విత్తనాలు తినడం వల్ల వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్, రాత్రి చెమటలు, అలసట వంటి సమస్యలను తొలగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, మహిళలు ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి.? ఎలా తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

Mood Swings: ఆడవాళ్లకు ఇది అమృతం లాంటిది..! ప్రతిరోజూ 1 చెంచా తిన్నారంటే ఫుల్‌ జోష్‌..
Mood Swings
Jyothi Gadda
|

Updated on: Sep 16, 2025 | 10:47 AM

Share

మహిళల శరీరంలో హార్మోన్ల సమతుల్యతలో అనేక హెచ్చుతగ్గులు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ మార్పులు వారిని ఇబ్బంది పెడుతుంటాయి. దాంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.. మహిళలు తరచు చాలా చిరాకుపడుతూ, చిన్న విషయాలకే కోపంగా ఉండటం చూస్తుంటాం. దీంతో పాటు, వారు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, వెన్నునొప్పిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో చాలా మంది మహిళలకు చాలా రోజుల ముందుగానే పీరియడ్స్ నొప్పులు రావడం ప్రారంభిస్తాయి. అలాంటి మహిళలు దానిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఆందోళన పడుతుంటారు. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే ఇక్కడ ఒక అద్భుత నివారణ ఉంది.. కొన్ని విత్తనాల మిశ్రమం మహిళలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా ప్రకారం, మిశ్రమ విత్తనాలు తినడం వల్ల వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్, రాత్రి చెమటలు, అలసట వంటి సమస్యలను తొలగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, మహిళలు ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి.? ఎలా తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ఈ విత్తనాలను తినవచ్చు.

ఇవి కూడా చదవండి

పొద్దుతిరుగుడు విత్తనాలు: ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల మహిళల్లో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (PMS) లక్షణాలను తగ్గిస్తుంది.

సోంపు గింజలు: వంటగదిలో ఉండే ఈ మసాలా దినుసు మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మహిళల్లో వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

అవిసె గింజలు: ఈ చిన్న గోధుమ గింజలు మహిళలకు చాలా అవసరమైన హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి.

గుమ్మడికాయ గింజలు: ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. మానసిక స్థితిలో మార్పుల సమస్యను తొలగిస్తుంది.

నువ్వులు: నువ్వులు తినడం వల్ల మహిళల్లో హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. ఈ చిన్న తెల్లని నల్లని గింజలు ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడతాయి.

ఈ విత్తనాల మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలి: దీని కోసం ఒక ఫ్రైయింగ్ పాన్ ని గ్యాస్ మీద ఉంచి, అందులో అన్ని విత్తనాలను ఒక్కొక్క చెంచా చొప్పున వేసి 5 నిమిషాలు దొరగా వేయించాలి. ఆ తర్వాత వాటిని చల్లారనిచ్చి గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ విత్తనాలను మీరు అనేక విధాలుగా మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.