Food: రొయ్యలు తినగానే వీటి జోలికి అస్సలు వెల్లకండి.. చాలా డేంజర్‌

రొయ్యలు.. మనలో చాలా మంది వీటిని అత్యంత ఇష్టంగా తింటుంటారు. రుచితో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు వీటితో పొందొచ్చు. అయితే ఆరోగ్యానికి మంచి చేసే రొయ్యలు కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కూడా కారణంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రొయ్యలు తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని...

Food: రొయ్యలు తినగానే వీటి జోలికి అస్సలు వెల్లకండి.. చాలా డేంజర్‌
Food
Follow us

|

Updated on: Jun 11, 2024 | 12:10 PM

రొయ్యలు.. మనలో చాలా మంది వీటిని అత్యంత ఇష్టంగా తింటుంటారు. రుచితో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు వీటితో పొందొచ్చు. అయితే ఆరోగ్యానికి మంచి చేసే రొయ్యలు కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి కూడా కారణంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రొయ్యలు తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ రొయ్యలు తీసుకోగానే దూరంగా ఉండాల్సిన ఆ ఫుడ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా కొందరు ప్రాన్స్‌ చేసే సమయంలో క్రీమ్‌ సాస్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే దీనివల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రొయ్యలు తీసుకున్న వెంటనే పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పాల ఉత్పత్తుల్లోని కాల్షియం రొయ్యల్లోని ప్రోటీన్‌లతో చర్య జరుపుతుంది. ఇది జీర్ణక్రియ సమస్యలకు, కడుపు నొప్పికి కారణమవుతుంది.

* రొయ్యల ఫ్రై అంటేనే చాలా స్పైసీగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే సాధారణంగా రొయ్యలు వేడి చేస్తాయి. అందులోనూ బాగా స్పైసీగా తీసుకుంటే కడుపులో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* రొయ్యలు తీసుకున్న వెంటనే రెడ్‌ మీట్‌ లేదా బచ్చలికూరను అస్సలు ముట్టుకోకూడదు. సాధారణంగానే రొయ్యలలో ఐరన్‌ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రెడ్‌మీట్‌లోనూ ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే ఐరెన్‌ లోపం ఉన్న వాళ్లకి పర్వాలేదు కానీ ఎక్కువగా ఉన్న వారికి మాత్రం ఇది హానికరంగా చెబుతున్నారు.

* పిండి ఎక్కువగా ఉండే బ్రెడ్‌ వంటి వాటితో రొయ్యలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కడుపు త్వరగా ఉబ్బిన భావన కలగడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* ఇక రొయ్యల ఫ్రైలో నిమ్మకాయ రసం పిండుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే రొయ్యలతో పాటు సిట్రస్‌ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్‌ పండ్లలోని ఆమ్లత్వం రొయ్యల్లోని ప్రోటీన్లతో చర్య జరుపుతుంది. ఇది కడుపు నొప్పికి దారి తీస్తుంది.

నోట: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్