- Telugu News Lifestyle These foods should not be consumed during periods, check here is details in Telugu
Foods in Periods: పీరియడ్స్‌లో ఈ ఆహారాలు అస్సలు తీసుకోకూడదట..
మహిళల్లో ఉండే సాధారణ సమస్యల్లో పీరియడ్స్ కూడా ఒకటి. నిజంగానే ఇది మహిళలకు ఒక పెద్ద సమస్య. ఎప్పుడూ వచ్చే పీరియడ్సే కదా అని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ నెలసరి సమయంలోనే బాడీలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో మహిళలు చాలా నీరసంగా, చికాకుగా ఉంటారు. అలాగే అలసట, కడుపు నొప్పి, వెన్ను నొప్పి, కండరాల నొప్పులు, ఇంటి పనులు, ఒత్తిళ్లు వంటివి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి సమయంలోనే..
Updated on: Aug 29, 2024 | 2:27 PM

మహిళల్లో ఉండే సాధారణ సమస్యల్లో పీరియడ్స్ కూడా ఒకటి. నిజంగానే ఇది మహిళలకు ఒక పెద్ద సమస్య. ఎప్పుడూ వచ్చే పీరియడ్సే కదా అని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ నెలసరి సమయంలోనే బాడీలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో మహిళలు చాలా నీరసంగా, చికాకుగా ఉంటారు.

అలాగే అలసట, కడుపు నొప్పి, వెన్ను నొప్పి, కండరాల నొప్పులు, ఇంటి పనులు, ఒత్తిళ్లు వంటివి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి సమయంలోనే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కానీ చాలా మంది ఏవి పడితే అవి తింటారు. ఇలాంటివి తినడం వల్ల మరిన్ని సమస్యలు రావచ్చు.

పీరియడ్స్‌లో కూడా క్రేవింగ్స్ ఉంటాయి. దీంతో చాలా మంది చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటారు. వీటిని తినడం వల్ల మానసిక స్థితిపైన ప్రభావం పడుతుంది. కడుపులో నొప్పి కూడా వస్తుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, సోడా కేకులు, స్వీట్స్ కూడా తినకూడదు. ఇవి శరీరంలోని రక్త పోటును పెంచుతాయి. శరీరంలో వాపులు కూడా వస్తాయి. కాఫీలు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

చిప్స్, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల బాడీ డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. యోనిలో కూడా నొప్పిగా, మంటగా అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం, నొప్పి కూడా వస్తుంది. కాబట్టి ఈ సమయంలో చాలా తేలికగా జీర్ణం అయ్యే, శక్తిని ఇచ్చే ఫుడ్స్ తీసుకోవాలి.




