Five Juices For Health : ఈ ఐదు జ్యూస్‌లు ఆరోగ్యానికి చాలా కీలకం.. ఇమ్యూనిటీ పెరగాలంటే తప్పకుండా తాగాల్సిందే..

Five Juices For Health : కొత్తగా వచ్చే రోగాలను ఎదుర్కోవాలంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ అనేది చాలా ముఖ్యం. అది ఎక్కడ దొరుకుతుందంటే ఎక్కువగా పళ్ల రసాల వైపే చూస్తారు. ఎందుకంటే ఇది ముమ్మాటికి నిజం. శరీరానికి కావలసిని ఐదు జ్యూస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

Updated on: Mar 24, 2021 | 12:30 PM

పుచ్చకాయ రసం : నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. ఇందులో ఎ, సి విటమిన్లతో పాటు మెగ్నీషియం, జింక్‌ వంటి పోషకాలు ఉంటాయి. నేరుగా తినడం ఇష్టం లేని వారు రసం చేసుకొని కూడా తాగవచ్చు.

1 / 5
టొమాటో జ్యూస్‌ : నిత్య జీవితంలో వాడే టమోటాలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. సి, ఇ విటమిన్లు, బీటా కెరోటిన్‌.. వంటి పోషకాలు ఫ్రీరాడికల్స్‌ రోగనిరోధక శక్తిపై దాడి చేసి కణాల్ని దెబ్బతీయకుండా కాపాడతాయి. రోజుకు ఒక గ్లాస్‌ టొమాటో జ్యూస్‌ను తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగువుతుంది.

2 / 5
నిమ్మజాతి పండ్లతో: కమలాఫలం, ద్రాక్ష, నిమ్మకాయ.. లాంటి నిమ్మజాతి పండ్లలో విటమిన్‌ ‘సి’ పుష్కలంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఏ అనారోగ్యాన్నైనా త్వరగా నయం చేయడంలో చురుగ్గా పనిచేస్తాయి. నిమ్మజాతి పండ్లతో తయారుచేసిన జ్యూస్‌లను తరచూ తీసుకోవాలి.

3 / 5
బీట్‌రూట్‌, క్యారట్‌ జ్యూస్‌ : బీట్‌రూట్‌, క్యారట్‌లలో విటమిన్‌ ‘ఎ’, ‘సి’, ‘ఇ’లతో పాటు ఐరన్‌, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇక ఈ జ్యూస్‌లలో కొంచెం పసుపు, అల్లం లాంటివి జత చేయడం ద్వారా జలుబు, దగ్గు వంటి వాటికి కూడా చెక్‌ పెట్టవచ్చు.

4 / 5
గ్రీన్‌ జ్యూస్‌ : గ్రీన్‌ యాపిల్‌, పాలకూర, కీరా, నిమ్మకాయ, అల్లం.. వంటి వాటితో తయారుచేసే గ్రీన్‌ జ్యూస్‌ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వీటిలో ఉండే ‘ఎ’, ‘సి’, ‘బి-6’ విటమిన్లతో పాటు ఐరన్‌, క్యాల్షియం.. వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

5 / 5
Follow us