
ప్రతి ఒక్కరికీ విటమిన్లు అవసరం. చిన్న వారైనా.. పెద్ద వారైనా వారికి వారి వయసుకు తగ్గట్టుగా విటమిన్లు అవసరం అవుతాయి. కానీ పురుషుల కంటే మహిళలకు కావాల్సిన విటమిన్లు వేరుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ డైట్ లో మహిళలు తప్పనిసరిగా కొన్ని రకాల విటమిన్ లను ఖచ్చితంగా చేర్చు కోవాలని అంటున్నారు. మహిళలు.. కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు పెడతారు. కాబట్టి ఖచ్చితంగా మగ వారి కంటే ఆడవారికి బలం ఎక్కువగా అవసరం అవుతుంది. మరి లేడీస్ కి ఎలాంటి విటమిన్లు అవసరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలకు 40 నుంచి 45 సంవత్సరాలు వయసు రాగానే వారిలో మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది. దీంతో శరీరంలో పలు రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. విటమిన్ ఏ అధికంగా ఉన్న.. పాల కూర, గుమ్మడి గింజలు, క్యారెట్, బొప్పాయి వంటివి తీసుకుంటే చాలా మంచిది.
మహిళలకు అవసరం అయ్యే వాటిల్లో విటమిన్ బి9 కూడా ఒకటి. ఈ విటమిన్ లోపం ఉంటే.. జనన సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మహిళలు రోజు వారీ ఆహారంలో విటమిన్ బి9 అధికంగా ఉండే ఈస్ట్, బీన్స్, ధాన్యాలను డైట్ లో చేర్చుకుంటే మంచిది.
మహిళలు బలంగా, దృఢంగా ఉండాలంటే.. విటమిన్ డి చాలా ముఖ్యం. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఎముకలు బలహీన పడతాయి. ముఖ్యంగా మహిళలు కాల్షియంతో పాటు విటమిన్ డి తీసుకోవడం కూడా ముఖ్యం. అందుకే మహిళలు ప్రతి రోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. గుడ్లు, పాలు, చీజ్, పట్టు గొడుగులు, కొవ్వు ఉన్న చేపలు వంటివి కూడా తింటూ ఉంటే విటమిన్ డి లోపం తలెత్తకుండా ఉంటుంది.
మహిళల చర్మంపై త్వరగా ముడతలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వయసు మీద పడే కొద్దీ నిగారింపు కూడా తగ్గి పోతుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే విటమిన్ ఈ ఎక్కువగా ఉండే బాదం, పాలకూర, వేరుశనగా తీసుకోవాలి.
లేడీస్ లో విటమిన్ కె సరిగ్గా లేకపోతే.. పీరియడ్స్, ప్రసవ సమయంలో ఎక్కువగా రక్త స్రావం అవుతుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే పచ్చి కూరగాయలు, సోయాబీన్ ను తప్పకుండా డైట్ లో చేర్చు కోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.