Health: శరీరంలో ఈ మార్పులా.? ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే..

ఉప్పు లేని కూరని ఊహించుకోవడం కష్టం. కూరలో ఉప్పు సరిపడా వేయకపోతే కచ్చితంగా రుచి ఉండదు. అయితే కూరకు రుచిని ఇచ్చే ఉప్పు ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. ఉప్పును ఎక్కువగా తీసుకోడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఉప్పు ఎక్కువగా...

Health: శరీరంలో ఈ మార్పులా.? ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే..
Salt
Follow us

|

Updated on: Sep 02, 2024 | 7:51 PM

ఉప్పు లేని కూరని ఊహించుకోవడం కష్టం. కూరలో ఉప్పు సరిపడా వేయకపోతే కచ్చితంగా రుచి ఉండదు. అయితే కూరకు రుచిని ఇచ్చే ఉప్పు ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. ఉప్పును ఎక్కువగా తీసుకోడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని హెచ్చరించింది. ఉప్పు ఎక్కువైతే బీపీ, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నామన్న విషయాన్ని శరీరం మనకు అలర్ట్‌ చేస్తుంది. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఉప్పు ఎక్కవైతే కనిపించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* తరచూ విపరీతమైన దాహంలాంటి భావన కలుగుతుంటే శరీరంలో ఉప్పు శాతం పెరిగినట్లు అర్థం చేసుకోవాలి. శరీరంలో సోడియం కంటెంట్‌ పెరిగితే అది నీటి కొరతకు దారి తీస్తుంది. ఈ కారణంగానే తరచూ దాహం వేస్తుంది.

* సోడియం కంటెంట్‌ ఎక్కువైతే.. శరీరంలో వాపు సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని కాళ్లు, చేతులు, ముఖంలో వాపు కనిపిస్తుంది. సోడియం ఎక్కువైతే శరీరంలో నీరు పేరుకు పోతుంది. ఇది వాపునకు కారణమవుతుంది.

* ఉన్నపలంగా రక్తపోటు పెరుగుతోన్నా కచ్చితంగా ఉప్పు ఎక్కువైనట్లు అర్థం చేసుకోవాలి. శరీరంలో సోడియం కంటెంట్‌ ఎక్కువైతే రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడుతాయి. ఈ కారణంగా రక్తపోటు పెరిగి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

* మూత్రం రంగు మారడం కూడా శరీరంలో ఉప్పు ఎక్కువైందని చెప్పడానికి కారణంగా చెప్పొచ్చు. సోడియం కంటెంట్‌ ఎక్కువైతే.. శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీని కారణంగా మూత్రం రంగు ముదురు రంగులోకి మారుతుంది.

* శరీరంలో సోడియం కంటెంట్‌ ఎక్కువైతే.. తలనొప్పికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు రక్త నాళాలు విస్తరిస్తుంది, ఇది తలనొప్పికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ తలనొప్పి ఉంటే ఉప్పు తగ్గించాలి.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తీసుకుంటే శరీరంలో సోడియం ఎక్కువైనా సోడియం స్థాయిని సమతుల్యం చేస్తుంది. అలాగే ఆహారంలో పై నుంచి ఉప్పు వేసుకోవడం పూర్తిగా మానేయాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ మానుకోవాలి. అలాగే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్యాకేజ్‌ ఫుడ్‌ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్త కోసం క్లిక్‌ చేయండి..