Lifestyle: బెల్లం తింటున్నారా.? ఒకసారి ఈ విషయాలు తెలుసుకోండి..

బెల్లం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్పరస్ వంటివి ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. అయితే బెల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనడంలో ఎంత నిజం ఉందో. కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారికి మాత్రం మంచిది కాదని చెబుతున్నారు...

Lifestyle: బెల్లం తింటున్నారా.? ఒకసారి ఈ విషయాలు తెలుసుకోండి..
Jaggery
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 27, 2024 | 9:05 PM

బెల్లం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్పరస్ వంటివి ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. అయితే బెల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనడంలో ఎంత నిజం ఉందో. కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారికి మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇంతకీ బెల్లానికి ఎవరు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* నిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే 10 గ్రాముల బెల్లంలో 9.7 గ్రాముల చక్కెర ఉంటుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు. కాబట్టి, చక్కెర సంబంధిత సమస్యల విషయంలో బెల్లం తినకూడదు.

* బరువు తగ్గాలనుకునే వారు కూడా బెల్లానికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. 100 గ్రాముల బెల్లంలో 385 కేలరీలు ఉంటాయి. పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల తక్కువ పరిమాణంలో తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు.

* కీళ్ల నొప్పులతో బాధపడే వారు కూడా బెల్లాన్ని తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బెల్లం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

* మలబద్ధకం సమస్యతో బాధపడే వారు కూడా బెల్లానికి దూరంగా ఉండాలి. బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

* వేసవి కాలంలో బెల్లం ఎక్కువగా తింటే ముక్కు నుంచి రక్తం కారుతుంది. ముక్కు నుంచి రక్తం వచ్చే సమస్య ఉన్నా వేసవిలో బెల్లం తినకూడదు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో