Lifestyle: కళ్లు ఎర్రబడడం కూడా ఆ వ్యాధి లక్షణం కావొచ్చు..
హైబీపీ కారణంగా శరీరంలో రక్తప్రసరణ వేగం పెరుగుతుందని తెలిసిందే. ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండె రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దీని కారణంగా సిరల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండె ఆగిపోవడానికి కారణమవుతుండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే హైబీపీ ముందుగానే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చని నిపుణులు...
మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా అధిక రక్తపోటు సమస్య తీవ్రమవుతోంది. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించేంది. కానీ ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని వారిలో ఈ సమస్య కనిపిస్తోంది. హైబీపీ కాలక్రమేణ గుండె సంబంధిత సమస్యలకు కూడా కారణమవుతోంది. అయితే రక్తపోటును వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని ముందస్తు లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హైబీపీ కారణంగా శరీరంలో రక్తప్రసరణ వేగం పెరుగుతుందని తెలిసిందే. ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండె రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దీని కారణంగా సిరల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండె ఆగిపోవడానికి కారణమవుతుండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే హైబీపీ ముందుగానే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా హైబీపీ ఉన్న వారిలో చెమట, గుండె కొట్టుకోవడంలో వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిసిందే. అయితే మరికొన్ని లక్షణాలు ద్వారా కూడా ఈ సమస్యను ముందుగానే తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
ఇఇలాంటి లక్షణాల్లో మొదటిది మైకంగా ఉండడం. కళ్లు చీకట్లు అయిన భావన కలిగినా, ఒక్కసారిగా నిస్సత్తువుగా ఉన్నా హైబీపీ లక్షణంగా భావించాలని చెబుతున్నారు. అలాగే ఉన్నపలంగా చెమట రావడం, నిద్రలేమి సమస్య వెంటాడడం కూడా హైబీపీ లక్షణాలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. కళ్లు ఎర్రబడడం, కళ్లలో రక్తపు మచ్చలు కనిపించినా అది హైబీపీకి లక్షణంగా భావించాలని చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో షుగర్ వ్యాధి ఉన్న వారిలో కూడా కళ్లు ఎర్రబడడం గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా కళ్లు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
అధిక బీపీ వల్ల కళ్లలోని నరాలపై కూడా ఒత్తడి పడుతుందని చెబుతున్నారు. ఈ కారణంగానే కల్లు ఎర్రగా మారుతాయని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ముఖం కూడా ఎర్రగా మారినా అది హైబీపీ లక్షణంగా చెబుతున్నారు. అధిక భావోద్వేగం, ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అధిక బీపీ ఉన్న వారు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు వ్యాయామంను అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..